వైఎస్ బ‌యోపిక్ లో సుహాసిని కీల‌క పాత్ర‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

senior actor suhasini
Updated:  2018-06-14 05:51:02

వైఎస్ బ‌యోపిక్ లో సుహాసిని కీల‌క పాత్ర‌

కొద్ది కాలంగా ఇటు టాలీవుడ్ లోనూ అటు బాలీవుడ్ లోను బ‌యోపిక్ ల హవా ఏ రేంజ్ లో కొన‌సాగుతుందో మ‌నంద‌రికీ తెలిసిందే. ఇక‌ ఇప్ప‌టికే దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌కరామారావు  బ‌యోపిక్ ను  ఆధారంగా చేసుకుని విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సినిమా తెర‌కెక్కించ‌నున్నారు. అయితే ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి ల‌క్ష్మిస్ ఎన్టీఆర్ అనే టైటిల్ కూడా ఖ‌రారు చేసింది చిత్ర యూనిట్. 
 
ఇక ఇదే క్ర‌మంలో దివంగ‌త నేత, కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌మంత్రి, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్ ను యాత్ర అనే టైటిల్ తో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే...ఈ సినిమాకు వి.ర‌ఘవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ సినిమాలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌ధాన పాత్ర‌లో మ‌ళ‌యాల న‌టుడు ముమ్మ‌ట్టి, అలాగే  విజ‌య‌మ్మ పాత్ర‌లో  ఆశ్రిత పొన్న‌గంటి న‌టిస్తున్నారు.ఇక‌ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాత్ర‌లో హీరో సూర్య న‌టిస్తున్నార‌ని అలాగే వైఎస్ శ‌ర్మిల పాత్ర‌లో హీరోయిన్ భూమిక న‌టిస్తున్నార‌ట‌. ఇక వైఎస్ అనుచ‌రుడు సూరీడు పాత్ర‌లో పోసాని కృష్ణ ముర‌ళీ న‌టిస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. 
 
ఇక తాజాగా మ‌రో వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రి హయాంలో రాష్ట్ర హోం మంత్రిగా ప‌నిచేసిన స‌బితా ఇంద్రారెడ్డి పాత్ర‌లో సీనియ‌ర్ న‌టి సుహాసిని న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈమె తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌లో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. గ‌తంలో స్టార్ హీరోలు న‌టించిన సినిమాల‌లో త‌ల్లి పాత్ర‌లో నటించి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
 
ఇక ఈమె స‌బితా ఇంద్రారెడ్డి పాత్ర‌లో న‌టిస్తారంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల్లో నిజ‌మెంతో తెలియాలంటే మ‌రికిద్దిరోజులు ఆగాల్సి ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.