టీడీపీకి మరో సీనియర్ నేత గుడ్ బై?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-16 17:31:59

టీడీపీకి మరో సీనియర్ నేత గుడ్ బై?

టీడీపీ అధికారంలోకి వచ్చాక, అధికార మదంతో వైసీపీని నామరూపాలు లేకుండా చేయాలనీ భావించి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో సుమారు 23 మంది ఎమ్మెల్యేలను మభ్య పెట్టి పార్టీ పిరాయించేలా చేశారు..రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా కేటాయించారు.కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎంత మంది పార్టీ ఫిరాయించిన ఐ డోంట్ కేర్...ప్రజల మద్దతు మా పార్టీకి ఉంది అని మొక్కొవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు..
 
ఈ క్రమంలోనే పార్టీని మరింత బలోపేతం చేయడానికి మరియు ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో సుమారు 3000 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయడానికి పూనుకున్నారు...
 
నవంబర్ 6న ప్రారంభమయిన ఈ ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటివరకు ఆరు నెలలపాటు సాగిన పాదయాత్ర 2000 వేల కిలోమీటర్లను పూర్తి చేసుకుంది...జగన్ చేస్తున్న పాదయత్ర జనసంద్రంగా మారుతుండంతో వైసీపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి... టీడీపీ కోట్ల రూపాయలు ఆశ చూపి ఫిరాయించేలా చేస్తే, ప్రజలు జగన్ కి ఇస్తున్న మద్దతును చూసి స్వచ్చందంగా వైసీపీలోకి నాయకులు క్యూ కడుతున్నారు...
 
ఈ క్రమంలోనే చాలామంది టీడీపీ నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు...ఇప్పుడు మరో సీనియర్ నేత టీడీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం...ఆయనే నెల్లూరు జిల్లా సీనియర్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి...టీడీపీ పైన అసంతృప్తిగా ఉన్న అయన, కార్యకర్త కోరిక మేరకు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి...
 
ఇప్పటికే నెల్లూరు జిల్లాలో వైసీపీ బలంగా ఉంది...ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరితే వైసీపీకి నెల్లూరు జిల్లాలో తిరుగుండదని వైసీపీ నాయకులు అంటున్నారు...నెల్లూరు జిల్లాలోని మరో సీనియర్ నేత ఆనం రాంనారాయణ రెడ్డి కూడా పార్టీ మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి...వీళ్ళు ఇద్దరు పార్టీ మారితే టీడీపీ నెల్లూరులో గల్లంతే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.