మంత్రి ఆది, ఎమ్మెల్సీ సుబ్బా రెడ్డి కుమ్మ‌క్కు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-20 12:04:22

మంత్రి ఆది, ఎమ్మెల్సీ సుబ్బా రెడ్డి కుమ్మ‌క్కు

క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగులో మంత్రి ఆది నారాయ‌ణ రెడ్డి, ఎమ్మెల్సీ రామ‌సుబ్బా రెడ్డికి మ‌ధ్య ఉన్న వైరం అంద‌రికీ తెలుసు, రాజ‌కీయంగా, వ్య‌క్తిగతంగా వీరి కుటుంబాల మ‌ధ్య ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌లు ఉన్న‌ప్ప‌టికీ  ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామ‌ల నేప‌ధ్యంలో ఇప్పుడు ఒకే పార్టీలో కొన‌సాగుతున్నారు.
 
ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే శత్రుత్వం ఉన్న  వీరిద్ద‌రూ క‌లిసి సిండికెట్ అయి సొంత జిల్లాకు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ కు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. గండికోట రిజ‌ర్వాయ‌ర్ ప‌రిధిలో  ఉన్న కొండాపురంలో బాధితుల‌కు ఏర్పాటు చేయ‌నున్న పున‌రావాస కాల‌నీ ప‌నుల‌కు సంబంధించి ప్ర‌భుత్వం టెండ‌ర్ల‌కు పిలుపునిచ్చింది. 
 
ఈ టెండ‌ర్ల‌కు సంబంధించిన వ్య‌వ‌హారంలో మంత్రి ఆది నారాయ‌ణ రెడ్డి, రామ‌సుబ్బా రెడ్డి వ‌ర్గీయులు సిండికెట్ అయిన‌ట్లు తెలిసింది. అయితే ఈ విష‌యం తెలుసుకున్న ఎంపీ ర‌మేష్ టెండ‌ర్ల‌ను నిలిపివేశారు. దీంతో రెచ్చిపోయిన మంత్రి ఆది, రామ సుబ్బా రెడ్డి వ‌ర్గీయులు.....సీఎం ర‌మేష్ కార్యాల‌యంపై దాడి చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ వ్య‌వ‌హారంపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో  చూడాలి.
chandrababu naidu
aadi narayana reddy
kadapa politcis

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.