ఈసారి టికెట్ క‌ష్ట‌మే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-25 18:03:54

ఈసారి టికెట్ క‌ష్ట‌మే

2014 ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసి అత్య‌ధిక మెజారిటీతో గెలిచి, కొద్దిరోజుల క్రితం అధికార తెలుగుదేశంపార్టీ నాయ‌కులు ప్ర‌క‌టించిన ఆఫ‌ర్స్ కు ఆశప‌డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. అంతే కాకుండా రాజ్యాంగానికి విరుద్దంగా పార్టీ ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేల‌లో ముగ్గిరికి టీడీపీ అధిష్టానం మంత్రి మ‌ద‌వుల‌ను అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే.
 
అయితే టీడీపీ నాయ‌కులు ఫిరాయింపు ఎమ్మెల్యేల‌ను ప్రోత్స‌హించ‌క‌పోయినా, ప‌రోక్షంగా పార్టీ అధినేత ఆదేశాల మేర‌కు ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు టీడీపీ నాయ‌కులు మ‌ద్ద‌తు తెలిపారు. వారు మ‌ద్ద‌తు తెలుప‌డంతో కొంత కాలంపాటు ఫిరాయించిన వారంద‌రూ సాఫిగానే సైకిపై ప్ర‌యాణించారు. అయితే ఈ మ‌ధ్య‌కాలంలో వారికి అనేక స‌మ‌స్య‌లు ఎదురు అవుతున్నాయి.
 
ఇక క‌డ‌ప ఫిరాయింపు ఎమ్మెల్యేల విష‌యానికి వ‌స్తే మంత్రి ఆది నారాయణ రెడ్డి టీడీపీలోకి ఫిరాయించిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న‌కు రోజు రోజుకు శ‌త్రువులు పెరిగిపోతున్నారు. ఆ శ‌త్ర‌వులు ప్ర‌తిప‌క్షాల నుంచి కాదు స్వ‌యానా టీడీపీకి చెందిన నాయ‌కులే అని చెప్ప‌వచ్చు. 
 
ఎందుకుంటే ఆయ‌న పార్టీలోకి ఫిరాయించిన‌ప్ప‌టినుంచి ప్ర‌తీ ఒక్క టీడీపీ నాయకుడితో గొడ‌వ పెట్టుకుంటూనే ఉన్నారు. దీంతో క‌డ‌ప‌లో టీడీపీ నాయ‌కుల‌పై వ్య‌తిరేక‌త తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. ఇక పార్టీ నేత‌లంద‌రూ క‌లిసి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు కంప్లైంట్ చేశారు. ఆదినారాయ‌ణ రెడ్డి వ‌ల్ల‌ పార్టీకి చెడ్డ పేరు వ‌స్తుంద‌ని చాలా సార్లు ఫిర్యాదు చేశార‌ట, కానీ ఆయ‌న‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు బాబు.
 
ఇక ఆది నారాయ‌ణ రెడ్డి సొంత నియోజ‌కవ‌ర్గం అయిన జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఆయ‌న‌కు బ‌ల‌మైన‌ ప్ర‌త్య‌ర్థులు ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీనే న‌మ్ముకుని ఉన్న నాయ‌కుల‌లో ఒక‌రు రామ‌సుబ్బారెడ్డి. ఈయ‌న‌కు మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డికి ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌న్నంత వైర్యం ఎప్ప‌టినుంచో వీరిద్ద‌రి మ‌ధ్య ఉంది. 
 
అయితే ఈ మ‌ధ్య కాలంలో ఆదినారాయ‌ణ‌ రెడ్డి టీడీపీ లో చేర‌డంతో వీరి గొడ‌వ‌కు మ‌రింత ఆజ్యం పోసిన‌ట్లు అయింది. ఇక వీరిద్ద‌రి గొడ‌వ‌లో చంద్ర‌బాబు మ‌ధ్య‌స్ధం చేద్దామ‌ని ప్ర‌య‌త్నించినా సాధ్యం కావ‌టం లేదు. ఈ గొడ‌వ‌లు తారా స్థాయికి చేరుకోవ‌డంతో ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఫిరాయింపు మంత్రికి డిపాజిట్లు కూడా రావ‌ని అక్క‌డి నేత‌లు అనుకుంటున్నారు.
 
ఇక ఆదే విష‌యంపై కూడా టీడీపీ అధిష్టానం కూడా తీవ్రంగా చ‌ర్చిస్తోంద‌ట‌. 2014 ఎన్నిక‌ల్లో దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌ల్లే ఆదినారాయ‌ణ రెడ్డి జ‌మ్మ‌ల‌మ‌డుగులో గెలిచార‌ని రామ‌సుబ్బారెడ్డి ఎద్దేవా చేస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.