మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డికి దిమ్మదిరిగే షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-16 14:38:23

మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డికి దిమ్మదిరిగే షాక్

ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ముందుగా అందరి నోటా వ‌చ్చేది బీకాంలో ఫిజిక్స్ చదివిన జలీల్ ఖాన్ తర్వాత ఆదినారాయణ రెడ్డి...జలీల్ ఖాన్ బీకాంలో ఫిజిక్స్ చదివి పాపులర్ అయితే ఆదినారాయణ రెడ్డి మాత్రం జగన్ ని విమర్శించి పాపులర్ అయ్యారు...అదే విమర్శల కోటాలో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు...దళితులను విమర్శించి మరింత  విమ‌ర్శ‌ల పాల‌య్యారు...
 
ఇది ఇలా ఉంటే జమ్మలమడుగులో రాజకీయం ఎప్పుడు వేడి వేడిగా ఉంటుంది..టీడీపీ సీనియర్ నేత రామసుబ్బా రెడ్డి వర్గానికి, ఆదినారాయణ రెడ్డి వర్గానికి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది.  అందుకే రామసుబ్బా రెడ్డికి పోటీగా ఆదినారాయణ రెడ్డి ముందుండేవారు...2014 ఎన్నికలలో కూడా ఇదే తంతు...టీడీపీ నుండి రామసుబ్బా రెడ్డి పోటీ చేస్తే వైసీపీ నుండి ఆదినారాయణ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు...
 
ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆదినారాయ‌ణ రెడ్డి  పార్టీ ఫిరాయించి టీడీపీలోకి జాయిన్ అయ్యారు...వీళ్లిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భ‌గ్గు మనేది కానీ టీడీపీ అధినేత జోక్యంతో ఇద్దరూ కలిసిపోయి చెరో అర్ధ‌రూపాయి వాటా తీసుకుంటున్నారు.
 
ఇంతవరకు అయితే బాగానే ఉంది కాని ఇంకో సంవత్సరంలోనే సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఇరువురు ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. రామసుబ్బా రెడ్డి మాత్రం నేను ఎప్పటినుంచో టీడీపీని నమ్ముకొని ఉన్నా కాబట్టి సీటు నాకే దక్కుతుంది అనే ధీమాతో ఉంటె, ఆదినారాయణ రెడ్డి మాత్రం జగన్ ని ఎదిరించింది నేను అందుకే సీటు నాకే ఇస్తారు అనే ధీమాతో ఉన్నారు..
 
కానీ ఆదినారాయ‌ణ రెడ్డికి ఎవరూ ఊహించని విధంగా ఇంటి నుండి పోరు మొదలైందని సమాచారం... ఆ వ్యక్తి ఎవరు అని అనుకుంటున్నారా? స్వయానా ఆది అన్న చదిపిరాళ్ల నారాయణ రెడ్డి తనయుడితో పోరు మొదలైందంటూ వార్తలు వస్తున్నాయి...గతంలో ఆదినారాయణ రెడ్డి తన రాజకీయ వారసుడిగా అన్న చదిపిరాళ్ల నారాయణ రెడ్డి తనయుడిని ప్రకటించారట...అందుకే ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగానే నాకు ఎమ్మెల్యే సీటు ఇప్పించాలని అడుగుతున్నారట...
 
మరో వైపు మంత్రి ఆదినారాయణ రెడ్డి కుమారుడు కూడా నియోజక‌వర్గంలో తిరుగుతున్నాడు...తన రాజకీయ వారసత్వాన్ని కొడుక్కి అప్పగించాలని భావిస్తున్న ఆదికి సొంత అన్న కొడుకు నుండే పోరు మొదలైంది... అయితే ఈ పోరు ఇంటిని దాటి రామసుబ్బా రెడ్డి దాకా  వెళ్తుందా లేక ఇంట్లోనే ఆగిపోతుందా చూడాలి..?

షేర్ :

Comments

1 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.