సీఎం రమేష్‌ కనిపిస్తే కాల్చివేత

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-21 15:52:18

సీఎం రమేష్‌ కనిపిస్తే కాల్చివేత

సార్వత్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు సెగ్మెంట్ ల వారీగా టికెట్ కోసం కొట్టు మిట్టాడుతున్నారు. గ‌తంలో వైసీపీ నుంచి టీడీపీ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, అలాగే టీడీపీ నాయ‌కులు 2019 ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున‌ సీటు ద‌క్కించుకునేందుకు మినీ మహానాడు స‌భ‌ల‌ను రాష్ట్ర వ్యాప్తంగా చేప‌డుతున్నారు.ఈ స‌భ‌ల‌లో తామంటే తాము గ్రేట్ అంటూ స‌భ‌ల్లో ఇత‌ర టీడీపీ నాయ‌కుల‌ను కించ‌ప‌రిచే విధంగా మాట్లాడుతున్నారు తెలుగు దేశం పార్టీ నాయ‌కులు. దీంతో వ‌ర్గ విభేదాలు తార స్థాయికి చేరుకుంటున్నాయి.
 
ఇక ఇప్ప‌టికే ఉప‌ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ మూర్తి త‌న‌యుడు కేఈ శ్యాంబాబు పార్టీ అధినేత సూచ‌న‌ల మేర‌కు మినీ మ‌హానాడు స‌భ‌ల‌ను ఏర్పాటు చేశారు. ఈ స‌భ‌కు ఎమ్మెల్సీ కేఈ ప్ర‌భాక‌ర్ హాజ‌ర‌య్యారు.ఆయ‌న‌తో పాటు శాలివాహ‌ణ కార్పోరెట‌ర్ తుగ్గ‌లి నాగేంద్ర హాజ‌ర‌య్యారు. ఈ స‌భ‌లో వీరిద్దరు మాటకు మాట మాట్లాడుకుంటూ వారిద్ద‌రి మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయి 
 
ఇక ఇదే క్ర‌మంలో ఆలూరు నియోజకవర్గ  టీడీపీ నేతల మధ్య విభేదాలు కూడా ర‌చ్చ‌కెక్కాయి. బళ్లారి రోడ్డు సమీపంలోని సెయింట్‌ జాన్స్ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌లో టీడీపీ ఇన్‌చార్జ్‌ వీరభద్రగౌడ్‌ అధ్యక్షతన మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు..నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్‌ వైకుంఠం మల్లికార్జున చౌదరిని ఉద్దేశించి ఆలూరులో టీడీపీ రెండో కార్యాలయం ప్రారంభించడం వెనక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య‌విభేద‌లు త‌లెత్తాయి.
 
ఇక తాజాగా వైయ‌స్సార్ జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగులో కూడా వ‌ర్గ విభేదాలు కూడా త‌లెత్తాయి. ఆదివారం రోజు సూర్యనారాయణరెడ్డి అధ్యక్ష‌త‌న మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఫిరాయింపు మంత్రి ఆది నారాయ‌ణ రెడ్డి హ‌జ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ తాను చేసే ప్ర‌తీ కార్య‌క్ర‌మాని అడ్డు వ‌స్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇక నుంచి ర‌మేష్ అడ్డు వ‌స్తే రానున్న రోజుల్లో కాల్చివేత రోజులు వ‌స్తాయ‌ని ఆదినారాయ‌న రెడ్డి హెచ్చ‌రించారు.
 
తాను చేసే కార్య‌క్ర‌మాలుకు అడ్డు రావ‌డ‌మే కాకుండా త‌న గురించి నీచంగా మాట్లాడుతున్నారని, అలాగే తాను మార్కెట్‌ యార్డులో కూపన్లు అమ్ముకున్నానని ప్రచారం చేయడం నీచమన్నారు ఆదినారాయ‌ణ రెడ్డి. త‌న‌పై రామసుబ్బారెడ్డి కానీ, ఆయన వర్గీయులు దేనికి సిద్ధపడినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని అన్నారు. 
 
అలాగే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి తాను క‌చ్చితంగా పోటీ చేస్తాన‌ని త‌న‌కు చంద్ర‌బాబు కచ్చితంగా టికెట్ ఇస్తార‌ని ఆదినారాయ‌న రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. తాను ఏదైనా త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకునే మందు త‌న కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.