ఆదినారాయ‌ణ రెడ్డి వైసీపీ నాయ‌కుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

adi narayana reddy tdp
Updated:  2018-06-25 06:23:18

ఆదినారాయ‌ణ రెడ్డి వైసీపీ నాయ‌కుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసి గెలిచి ఆ త‌ర్వాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్న ఆదినారాయ‌ణ రెడ్డి ఈ రోజు క‌డ‌ప ఉక్కు సాధ‌న‌ కోసం నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ ఎంపీ రమేష్ కు మ‌ద్ద‌తు తెలిపి వైసీపీ నాయ‌కులపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, కొద్ది రోజుల నుంచి వైసీపీ నాయ‌కులు పిచ్చికుక్క‌లతో స‌మానంగా వ్య‌వ‌హరిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు చేశారు. అలాగే వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా పిచ్చోడిలాగ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నార‌ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు.
 
అంత‌టితో ఆగ‌కుండా ప్ర‌ధాని మోడీని కూడా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. తాడు, బొంగ‌రం లేని వ్య‌క్తి మోడీ అని, అయితే త‌మ‌ నాయ‌కుడు సీఎం ర‌మేష్ కు అవ‌న్ని ఉన్నాయ‌ని ఎద్దేవా చేశారు. నాలుగు సంవ‌త్స‌రాలుగా కేంద్రం స్టీల్ ఫ్యాక్ట‌రీని కేటాయించ‌కుండా నాట‌కాలు ఆడుతోందని అదినారాయ‌ణ రెడ్డి మండిప‌డ్డారు. 
 
ప్రాణాల‌కు తెగించి దీక్ష‌లు చేస్తుంటే కేద్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆయ‌న అరోపించారు. అయితే ఇప్ప‌టికైనా కేంద్రం స్పందించి వెంట‌నే క‌డ‌ప‌లో స్టీల్ ఫ్యాక్ట‌రీని నిర్మించాల‌ని లేకపోతే ఎంపీ సీఎం ర‌మేష్ దీక్షను విర‌మించే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేశారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.