ఆదినారాయ‌ణ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

adi narayan reddy image
Updated:  2018-03-10 12:35:12

ఆదినారాయ‌ణ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు

తెలుగుదేశం త‌ర‌పున ఇద్ద‌రు ఎంపీలు కేంద్రం నుంచి త‌మ  మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు.. ఇంకా తాము ఎన్డీఏ లో  మిత్ర‌ప‌క్షంగా కొన‌సాగుతున్నాము అని అన్నారు. ఇక్క‌డ వ‌ర‌కూ బాగానే ఉంది.. ఏపీకి ఎటువంటి నిధులు ప్ర‌త్యేక హూదా ఇవ్వ‌ని ప‌క్షంలో, ఎన్డీఏలో కొన‌సాగ‌డం ఎందుకు అని బీజేపీ తో క‌లిసి మెలిసి ఎందుకు ఇంకా కొన‌సాగుతున్నారు అని ఇటు కాంగ్రెస్ - వైయ‌స్సార్ కాంగ్రెస్ ప్ర‌శ్నిస్తున్నాయి.
 
అయితే తెలుగుదేశం ఎంపీలు మంత్రులు మాత్రం కేంద్రం న్యాయం చేస్తుంది అనే ఆలోచ‌న త‌మ‌కు ఉంది అని అంటున్నారు.. అయితే కేంద్రానికి ఓ చిన్న అవ‌కాశం ఇవ్వాలి అని తాము ఎన్డీఏలో కొన‌సాగుతున్నాము అని అన్నారు.. కేంద్రం ఏపీకి మంచి చేస్తుంది అని ఇంకా ఎన్డీఏలో కొన‌సాగుతున్నాము అని మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి అన్నారు.. త‌మ‌కు స‌హ‌క‌రిస్తే పార్టీకి మంచిది అని ఆదినారాయ‌ణ రెడ్డి తెలియ‌చేశారు.
 
కేవ‌లం త‌మ క‌ష్టం వల్లే ఏపీలో ఇంత గ్రోత్ రోట్ సాధించి మంచి రేటింగ్ తో ముందుకు వెళుతున్నామ‌ని అన్నారు. తాము క‌ష్ట‌ప‌డి మంచి గ్రేడ్లు సాధించాము అని, అభివృద్దిలో ముందు ఉన్నాము అని తెలియ‌చేశారు మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి.. కేంద్రం ఇవన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని త‌మ‌ను ఆదుకోవాల‌ని, తాము మిత్ర‌ప‌క్షంగా ఉండాలి అనే కోరిక‌తో ఎన్డీఏలో కొన‌సాగుతున్నాము అని తెలియ‌చేశారు ఆయ‌న‌.
 
అయితే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల పై ఆయ‌న జోస్యం చెప్పారు. వైసీపీలో కొంద‌రు ఎమ్మెల్యేలు త‌మ‌కు ఓటువేస్తారు అని అన్నారు.. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడం వ్యక్తిగత ఇష్టం కాబట్టి ఓటు వేస్తారన్నారు... వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేర‌క‌పోయినా క‌చ్చితంగా త‌మ‌కే ఓటు వేస్తారు అని ఆయ‌న అన్నారు.. ఇక మూడ‌వ వ్య‌క్తిని నిల‌బెట్టేది లేనిది సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యం అని, మాకు పూర్తి మెజార్టీ ఉంద‌ని అన్నారు మంత్రి ఆదినారాయణ రెడ్డి.. మొత్తానికి మంత్రి వ్యాఖ్య‌లు బ‌ట్టీ, ఎంత పెద్ద ఎత్తున లోప‌కారి ఒప్పందాలు నాయ‌కుల‌తో చేసుకుంటున్నారో ఇట్టే తెలిసిపోతోంది.

షేర్ :

Comments

1 Comment

  1. Ye ra adi ga, vote vesey room door deggara nee pellam ni nunchobettava yentra. Oka vote vestey oka round ani. Siggu leni vedhava.

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.