మంత్రి ఆది సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-15 07:50:12

మంత్రి ఆది సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు కీల‌క మ‌లుపులు తిరిగాయి. ప్ర‌త్యేక ప్యాకేజీ వ‌దిలేసి రండి.... వైసీపీ-టీడీపీ ఎంపీలంద‌రూ క‌లిసి మొత్తం 25 మంది చేత రాజీనామా చేయిద్దాం అంటూ వైయస్ జ‌గ‌న్ చేసిన సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న ఏపీ రాజ‌కీయాల్లో కాక రేపింది. 
 
జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చేసిన కొన్ని గంట‌ల‌కే ఫిరాయింపు మంత్రి ఆది నారాయ‌ణ రెడ్డి మ‌రో బాంబ్ పేల్చారు.  వైసీపీ ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలు చేస్తే...తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రులు  మార్చి 5 రాజీనామా చేస్తారంటూ సంచ‌ల‌నం రేపారు. అదే రోజు బీజేపీ మైత్రి నుండి కూడా బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌ట‌న చేశారు. 
 
మార్చి 5లోపే విభ‌జ‌న హామీల‌పై కేంద్రం స్పష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేస్తుంద‌ని ఆది నారాయ‌ణ రెడ్డి పేర్కొన్నారు. ఇటు వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి ప్ర‌క‌ట‌న...అటు ఆది నారాయ‌ణ రెడ్డి ప్ర‌క‌ట‌నతో ఒక్క‌సారిగా ఏపీ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేగింది. టీడీపీ జ‌గ‌న్ టార్గెట్ గా ముందుకు సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ రెండు పార్టీ  ఎంపీల‌కు రాజీనామా చేసే ద‌మ్ముందా.....చూద్దాం ఏం జ‌రుగుతుందో.....

షేర్ :

Comments

1 Comment

  1. Already Aadi back step vesi statement withdraw chesukunnadu raa jaffas admin

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.