టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా స‌వాల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-27 17:58:38

టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా స‌వాల్

ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ఉక్కు ప‌రిశ్ర‌మ‌కోసం అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ పోరాటంలో భాగంగా నేడు రాజంపేట మాజీ ఎమ్మెల్యే అకేపాటి అమర్ నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష రహదారుల దిగ్బంధం చేశారు. దీంతో రహ‌దారిపై ఎటు చూసినా వాహ‌నాలు భారీగా నిలిచిపోయాయి. 
 
ఈ సంద‌ర్భంగా అమ‌ర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు 2014లో అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి జిల్లాలోని ప్ర‌జ‌లు ప్ర‌తీ స‌మ‌స్య‌పై ఉద్య‌మాలు చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంద‌ని ఆయ‌న అన్నారు. ఇక ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్, బిటెక్ ర‌విలు ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం దొంగ దీక్ష‌లు చేస్తున్నార‌ని అమ‌ర్ నాథ్ రెడ్డి విమ‌ర్శ‌లు చేశారు. వారు చేసే దీక్ష‌లో ఏ మాత్రం చిత్తశుద్ది లేద‌ని ఆయ‌న మ‌డిప‌డ్డారు. 
 
ఒకవేళ‌ వారికి చిత్తశుద్ది ఉంటే 2014 నుంచి ఉక్కు పరిశ్ర‌మ క‌డ‌ప‌లో ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి వ్య‌తిరేకంగా పోరాడి ఉండే వార‌ని ఆయ‌న గుర్తు చేశారు. క‌డ‌ప ఉక్కు సాధ‌న‌ కోసం వైసీపీ ఎమ్మెల్యేలంద‌రు రాజీనామాలు చేసేందుకు సిద్ద‌మ‌ని, అయితే వారితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ద‌మేనా అని స‌వాల్ విసిరారు. కేవ‌లం ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయి కాబట్టి టీడీపీ నాయ‌కులు దొంగ దీక్ష‌లు చేస్తున్నార‌ని అమ‌ర్ నాథ్ రెడ్డి మండిప‌డ్డారు.
 
విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదా, రైల్వే జోన్, క‌డ‌ప ఉక్కు పరిశ్ర‌మ‌లు ఇంకా బ్ర‌తికే ఉన్నాయంటే అది కేవ‌లం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వల్లే అని స్ప‌ష్టం చేశారు. గ‌తంలో ప్ర‌త్యేక హోదా కోసం త‌మ ఎంపీలు ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి ప్ర‌జ‌ల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నార‌ని అమ‌ర్ నాథ్ రెడ్డి అన్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.