టీడీపీ... రైతు వ్యతిరేక పార్టీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-22 15:07:36

టీడీపీ... రైతు వ్యతిరేక పార్టీ

జిల్లాలో వచ్చిన గాలీవాన బీభత్సంతో దెబ్బతిన్న మామిడి తోటలను చూసి పరిశీలించేందుకు కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చింత రాజుపల్లి, భోయపల్లి, మదరపల్లి గ్రామాలలో మండల పార్టీ శ్రేణులతో కలిసి తిరిగి గాలివానలకు దెబ్బతిన్న ఉద్యాన పంటలను పరిశీలించారు రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డి. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రైతులను ఆదుకోవడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.టీడీపీ రైతు వ్యతిరేక పార్టీ అని ఎద్దేవా చేశారు.. రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలినా ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని, ఇంతవరకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదని తక్షణమే దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు ఆయన. ఒకే మాసంలో మూడు సార్లు తోటలు దెబ్బ తిన్న ఇంతవరకు ప్రభుత్వం రైతులను ఆదుకోలేదని ఆయన మండిపడ్డారు.
 
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో ఏదైనా ప్రకృతి వైపరీత్యం వ‌ల్ల‌ పంటలకు నష్టం  జరిగితే  నెలలోపే రైతులకు నష్ట పరిహారం చెల్లించేవారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్తిరీకరణ నిధి మరియు ప్రకృతి వైపరీత్యం వల్ల పంటల‌కు దెబ్బ తగిలితే వాటికి  వెంటనే నష్ట పరిహారం ఇవ్వవడం జరుగుతుంది. మళ్లీ రైతు రాజ్యం రావాలి అంటే జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అవ్వాలని రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డి అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.