మంత్రి అఖిల విష‌యంలో అది నిజ‌మే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

minister akhila priya and av subba reddy war
Updated:  2018-04-13 11:09:53

మంత్రి అఖిల విష‌యంలో అది నిజ‌మే

ఏపీ సీఎం చంద్ర‌బాబు మంత్రి అఖిల‌ప్రియ‌కు తెలుగుదేశం నాయ‌కులు ఏవీ సుబ్బారెడ్డికి మ‌ధ్య వివాదాల‌కు ఫుల్ స్టాప్ పెట్టాల‌ని మీటింగ్ ఏర్పాటుచేశారు... ఈ స‌మావేశానికి ఇరువురు హాజ‌ర‌య్యారు... మంత్రి అఖిల‌పై బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు చేయ‌డం ఏమిట‌ని సుబ్బారెడ్డిని మంద‌లించిన చంద్ర‌బాబు.. ఇక పెద్ద‌దిక్కుగా ఉన్న సుబ్బారెడ్డిని ఎందుకు క‌లుపుకుపోవ‌డం లేద‌ని అఖిల‌కు సూచించిన చంద్ర‌బాబు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఇంట‌ర్న‌ల్ గా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవాల‌ని తెలియ‌చేశార‌ట‌
 
మంత్రి భూమా అఖిలప్రియతో మనస్పర్ధలు వాస్తవమేనని  టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆళ్లగడ్డకు వెళ్లొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పలేదని ఆయ‌న తెలియ‌చేశారు... ఇద్ద‌రిని కలిసి పనిచేయాలని చెప్పారని ఆయన అన్నారు.... చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. భూమా నాగిరెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా నాతో చర్చించేవారని, అయితే... అఖిలప్రియ నాతో చర్చించాల్సిన అవసరం లేదనుకుంటున్నారని సుబ్బారెడ్డి అన్నారు... చంద్రబాబు సింగపూర్ నుంచి వచ్చాక మరోసారి భేటీ అవుతామన్నారు.
 
పరస్పర విమర్శలతో వార్తల్లో నిలుస్తున్న మంత్రి భూమా అఖిలప్రియ, కర్నూలు జిల్లా టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు  మాట్లాడారు.... కలహించుకొంటే బలహీనపడతారని తెలియ‌చేశారు,  వారిద్దరూ ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాలవ శ్రీనివాసులు, నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి కూడా ఉన్నారు. మొత్తానికి వీరి మ‌ధ్య పోరు ఇక త‌గ్గుముఖం ప‌డుతుందా లేదా అనేది చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.