బాబుకు హ్యండిచ్చిన అఖిల ప్రియ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-04 14:07:44

బాబుకు హ్యండిచ్చిన అఖిల ప్రియ‌

అస‌లే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఏడాది కూడా టైమ్ లేదు. ఈ పరిస్థితుల్లో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతూ, వారికి చేదోడు వాదోడుగా ఉండాల్సింది పోయి పార్టీ నాయ‌కుల‌తో వ‌ర్గ విభేదాలు పెట్టుకుంటూ కొద్ది కాలంగా ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌వుతూ వ‌స్తున్నారు.దీంతో టీడీపీ కేడ‌ర్ అంతంత మాత్రంగా ఉన్న కొన్నిచోట్ల కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అది క‌నుమరుగ‌య్యే ఆస్కారం ఎక్కువ‌గా ఉంద‌ని తాజాగా విశ్లేష‌కులు తెలుపుతున్నారు.
 
అయితే ముఖ్యంగా చెప్పాలంటే క‌ర్నూల్ జిల్లాలో టీడీపీ నాయ‌కుల మ‌ధ్య వ‌ర్గ విభేదాలు ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా చోటు చేసుకుంటున్నాయి. ఈ వ‌ర్గ విభేదాల వ‌ల్ల టీడీపీ కేడ‌ర్ అంతంత మాత్రంగా ఉన్న ఈ జిల్లాలో అది కూడా క‌నుమ‌రుగు అయ్యే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంద‌ని తాజాగా విశ్లేష‌కులు తెలుపుతున్నారు. దీంతో టీడీపీ నాయ‌కులు పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ జిల్లాలో టీడీపీకి కంచుకోట‌గా వ‌స్తున్న ప‌త్తికొండ, బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌కవ‌ర్గాలు కూడా 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ కి బీట‌లు వాలే ఆస్కారం ఎక్కువ‌గా వుంద‌ని తెలుస్తోంది. 
 
దీంతో బ‌న‌గాన‌ప‌ల్లె ఎమ్మెల్యే బీసీ జ‌నార్థ‌న రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నార‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ రెండు నియోజ‌కవ‌ర్గాల పంచాయితీని  ప‌క్క‌న పెడితే ముఖ్యంగా గ‌మ‌నించాల్సిన విష‌యం ఆళ్ల‌గ‌డ్డ, నంద్యాల పంచాయితీ. ఈ నియోజ‌కవ‌ర్గాల గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌సరం లేదు. ఎందుకంటే శోభా, భూమా మ‌ర‌ణం త‌ర్వాత ఇక్క‌డి రాజ‌కీయం కొత్త కొత్త వార్త‌లు రోజు రోజుకు మ‌రింత హీటెక్కిస్తున్నాయి. మంత్రి అఖిల ప్రియకు అలాగే ఏవీ సుబ్బారెడ్డి మ‌ధ్య వ‌ర్గ‌ విభేదాలు త‌లెత్తునే ఉన్నాయి. 
 
ఇక‌ వీరిద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య చేయ‌డానికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తిని వేదిక చేశారు. ఆయ‌న‌ స‌మ‌క్షంలో ఒక్క‌టి అయి, 24 గంట‌లు పూర్తి కాక‌ముందే మ‌ళ్లీ ఈ పంచాయితీ మొద‌టికి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో మంత్రి అఖిల ప్రియ రాజ‌కీయాల‌కు 2019 లో ఎండ్ కార్డ్ వేస్తార‌నే ఆలోచ‌న కూడా అక్క‌డ ప్ర‌జ‌ల్లో క‌లుగుతోంది. దీంతో అఖిల ప్రియ కొద్ది కాలంగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తి తో ఉంద‌ని తాజాగా వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
2014 ఎన్నిక‌ల్లో టీడీపీకి కేవ‌లం ఈ జిల్లా నుంచి మూడు అసెంబ్లీ సీట్ల‌ను మాత్ర‌మే ఇచ్చారు. దీంతో చంద్ర‌బాబు ఎక్కడ‌ పోగొట్టుకున్నామో అక్క‌డి నుంచే సాధించుకోవాల‌నే నేప‌థ్యంలో జిల్లా వ్యాప్తాంగా అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు.ఈ కార్య‌క్ర‌మాల‌లో భాగంగా ముఖ్య‌మంత్రి క‌ర్నూలు జిల్లాలో ప‌ర్య‌ట‌న చేస్తే అఖిల ప్రియ మాత్రం హాజ‌రు కాలేదు. దీంతో స్వయంగా చంద్రబాబు కోటరీ నుంచే కాల్ చేసి సభకు పిలిచినప్పటికీ అఖిలప్రియ మాత్రం సభకు హాజరుకావడానికి ఇష్టపడ‌లేదు. దీంతో చిన్న పెద్దా అన్న‌తేడా లేకుండా టీడీపీ నాయ‌కులు చంద్ర‌బాబు నాయుడు మాట విన‌డం లేదు.ఎప్పుడైతే ముఖ్య‌మంత్రి త‌మ‌కు అనుకూలంగా ఉంటారో అప్పుడే ఆయ‌న స‌భ‌ల‌కు హాజ‌రు అవుతాము తేక‌పోతో ఆయ‌న‌ స‌భ‌కు హాజ‌రు అయ్యే ప‌రిస్థితిలేద‌ని తెగేసి చెబుతున్నార‌ట‌. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.