జ‌న‌సేన‌లోకి అఖిల ప్రియ‌..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

janasena and akhila priya
Updated:  2018-09-18 12:44:35

జ‌న‌సేన‌లోకి అఖిల ప్రియ‌..

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో రాజ‌కీయ పార్టీ నాయ‌కులు త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని ఇత‌ర పార్టీలో జంప్ చేస్తున్నారు. అయితే ఇదే క్ర‌మంలో అధికార తెలుగుదేశం పార్టీ కి చెందిన ఓ మ‌హిళా మంత్రి మ‌రికొద్ది రోజుల్లో జ‌న‌సేన పార్టీలో చేరుతుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ మ‌హిళా మంత్రి ఎవ‌రో కాదు టీడీపీ ప‌ర్యాట‌క‌ శాఖ మంత్రి అఖిల ప్రియ. ఈమె కొద్దిరోజుల క్రితం నుంచి పార్టీ మారుతార‌నే ప్ర‌చారం జిల్లా అంత‌టా విసృతంగా ప్ర‌చారం సాగుతోంది.
 
గ‌తంలో కూడా మంత్రి తిరిగి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకోనుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌పై స్పందించిన అఖిల ప్రియ తాను వైసీపీలో చేర‌టం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇక ఈ మ‌ధ్య‌కాలంలో రాష్ట్రంలో జ‌న‌సేన పార్టీ కాస్త హైప్ కావ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి ప‌వ‌న్ క‌ళ్యాన్ ఎఫెక్ట్ ఉంటుంద‌ని, అది త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌భావం చూపుతుంద‌నే ఉద్దేశంతో ఆమె పార్టీ మారాల‌నే నిర్ణయం తీసుకున్నార‌ని ప్రచారం సాగుతోంది. అంతేకాదు జ‌న‌సేన పార్టీ కులాంత‌ర ఓట్లపై ఎక్కువ ప్ర‌భావం చూపుతుంద‌ని, త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన ఆళ్ల‌గ‌డ్డ‌లో బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉండ‌టంతో ఆమె పార్టీ మారాల‌నే నిర్ణ‌యం తీసుకుందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. 
 
త‌న త‌ల్లి మ‌ర‌ణం త‌ర్వాత ఆళ్ల‌గ‌డ్డ‌లో ఉప ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసి గెలిచి ఆ తర్వాత అధికార ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి ముఖ్యంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. తాను పార్టీ మారింది కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ది కోస‌మే అని చెప్పి ప‌చ్చ‌కండువా కప్పుకున్న మంత్రి ఇంత‌వ‌ర‌కు ఒక్క‌చోట కూడా అభివృద్ది కార్య‌క్ర‌మం చేయ‌లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.
 
అలాగే త‌న తండ్రి ప్ర‌ధాన అనుచ‌రుడు టీడీపీనేత ఏవీ సుబ్బారెడ్డితో వైర్యం ఇవ‌న్ని అఖిల‌కు పెద్ద‌స‌మ‌స్య‌గా మార‌నున్నాయి. పైగా 2019 ఎన్నిక‌ల్లో త‌న‌కు టీడీపీ టికెట్ విష‌యంలో ధీమా లేక‌పోవ‌డంతో అఖిల ప్రియ మళ్లీ జంపింగ్ కు సిద్ద‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తుంది. చూద్దాం జ‌న‌సేన పార్టీ లో చేరుతార‌నే వార్త‌లపై అఖిల ప్రియ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.