జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భేటీ కానున్న అఖిల ప్రియ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan and akhila priya
Updated:  2018-08-09 02:31:14

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భేటీ కానున్న అఖిల ప్రియ‌

వైఎస్ కుటుంబానికి భూమా కుటుంబానికి ద‌గ్గ‌ర బందుత్వం ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ బందుత్వాన్ని మ‌రింత ద‌గ్గ‌ర చేసుకునేందుకు గతంలో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మేన‌మామ అయిన‌టువంటి ర‌వీంద్రనాథ్ కూమారుడుతో అఖిల ప్రియ వివాహం జ‌రిపించారు. కానీ కొద్ది కాలానికే వీద్ద‌రి మ‌ధ్య పొంత‌న కుద‌ర‌క విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు మ‌నంద‌రికి తెలిసిందే శోభానాగి రెడ్డి మ‌ర‌ణించ‌డం, ఆళ్ల‌గ‌డ్డ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం, వైసీపీ త‌ర‌పున పోటీ చేసిన అఖిల ప్రియ చ‌క‌చ‌క టీడీపీలోకి ఫిరాయించారు. 
 
ఫిరాయించిన వెంట‌నే అఖిల ప్రియ‌కు ప‌ర్యాటక శాఖ మంత్రి ప‌ద‌విని కూడా ఇచ్చారు చంద్ర‌బాబు నాయుడు.అయితే రాజ‌కీయంగా ఎన్ని ఎత్తుగ‌డ‌లు వేసినా కూడా ఫ్యామిలీ ప‌రంగా అంద‌రూ ఒక్క‌టే. అందుకు ఉదాహ‌ర‌ణ బ‌న‌గానప‌ల్లే ఎమ్మెల్యే బీసీ జ‌నార్థ‌న్ రెడ్డికి కాంట్రాక్ట్ ప‌నుల‌ను ఇవ్వ‌కుండా త‌న బందువు నంద్యాల ఎమ్మెల్యే బ్ర‌హ్మ‌నంద‌రెడ్డి మామ వైసీపీ ఇంచార్జ్ కాట‌సాని రామిరెడ్డికి కాంట్రాక్ట్ లు ఇచ్చారు. 
 
రాజ‌కీయాల కంటే ఫ్యామిలీకే ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చే భూమా ఫ్యామీలీలో ఇప్పుడు పండ‌గ వాతావ‌రణం రాబోతుంది. పండుగ అంటే నిజ‌మైన పండుగ కాదు. ఈ నెల 29న‌ ఉద‌యం అఖిల ప్రియ వివాహం జ‌రుగ‌బోతుంది. ఈ వివాహానికి రాజ‌కీయ నాయ‌కుల‌ను, తెలంగాణ ముఖ్య‌మంత్రి కూమారుడు కేటీఆర్ కు, అలాగే ఉమ్మ‌డి రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కు స్వ‌యంగా ఆహ్వాన ప‌త్రికను ఇచ్చారు.
 
ఇక మిగిలింది వైఎస్ ఫ్యామిలీ మాత్ర‌మే, అఖిల ప్రియ‌ పెళ్లికార్డు జ‌గ‌న్ ఫ్యామిలీని కలిసి ఆమె సోద‌రితో క‌లిసి శుభ‌లేఖ ఇవ్వ‌నున్నారు అని తెలుస్తోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా తూర్పుగోదారి జిల్లాలో ఉన్నారు కాబ‌ట్టి ఆమె సోద‌రుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసి వివాహ ప‌త్రిక ఇచ్చి వ‌స్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటు అఖిల ప్రియ‌, వైయ‌స్ విజ‌య‌మ్మను, భార‌తిని క‌లిసి శుభ‌లేఖ ఇచ్చి పెళ్లికి పిల‌వ‌నున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. మొత్తానికి చాలా రోజుల త‌ర్వాత భూమా ఫ్యామిలీ వైఎస్ గ‌డ‌ప తొక్క‌నుంది. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.