సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-02 18:32:43

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఈ రోజు క‌ర్నూల్ జిల్లాలో న‌వ నిర్మాణ దీక్ష టీడీపీ నాయ‌కులు ఏర్పాటు చేశారు. ఈ దీక్ష‌లో ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి అఖిల ప్రియ పాల్గొన్నారు. ఈ దీక్ష సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రధాని న‌రేంద్ర మోడీ ప‌రిపాల‌న‌పై ప‌లు ఆస‌క్తి క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. మోడీ ప‌రిపాల‌న‌లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని, కేంద్రంలో బీజేపీకి అడ్డు ఆదుపు లేకుండా పోతోంద‌ని ఆమె వ్యాఖ్యనించారు.
 
ఒక వైపు ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న మ‌హిళ‌లు సొంతంగా వారి కాళ్ల‌మీద వారు నిల‌బ‌డాల‌నే ఉద్దేశ్యంతో ఉద్యోగాలను కల్పించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని అఖిల ప్రియ అన్నారు. అయితే బీజేపీ ప్ర‌భుత్వం మాత్రం మ‌హిళ‌లు ఎక్క‌డ క‌నిపిస్తే అక్క‌డ వారిపై దాడి చేయిస్తున్నార‌ని, అత్యాచారాలు చేయాలంటూ నేత‌ల‌తో రెచ్చ‌గొట్టి పంపిస్తున్నారని ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 
 
ఇక ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాల‌తో పాటు రాష్ట్ర ప్ర‌జ‌లు కూడా తీవ్ర స్థాయిలో త‌ప్పుబ‌డుతున్నారు. చంద్ర‌బాబు నాయుడు నాలుగు సంవ‌త్స‌రాలు బీజేపీతో దోస్తీ చేసిన‌ప్పుడు ఏపీలో ఎంతో మంది మైన‌ర్ బాలిక‌ల‌పై అత్యాచారాలు జ‌రిగాయ‌ని గుర్తు చేశారు. అయితే గ‌తంలో టీడీపీ స‌ర్కార్ ఈ హ‌త్యాచారాల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదని మండిప‌డుతున్నారు. ఇక ఇప్పుడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బీజేపీ మిత్ర‌ప‌క్షానికి క‌టీఫ్ చెప్ప‌గానే అఖిల ప్రియకు అక‌స్మాత్తుగా ఇవ‌న్ని గుర్తుకు వ‌చ్చాయా అని విమ‌ర్శిస్తున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.