డైల‌మాలో చంద్ర‌బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-12 16:11:10

డైల‌మాలో చంద్ర‌బాబు

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలంద‌రూ  క‌లిసి ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో అధిష్టానానికి షాక్ లు ఇస్తూనే ఉన్నారు. ఒక‌రేమో టీడీపీపై ప్ర‌జ‌లకు వ్య‌తిరేక‌త ప్ర‌భావం ఎక్కువ అవుతోంద‌ని చెబుతున్నారు.
 
అలాగే తాము త‌మ‌ నియోజ‌కవ‌ర్గంలో ప్ర‌యాణించినప్పుడు ఎన్నికల్లో ప్ర‌క‌టించిన హామీల‌ను అములు చేయ‌లేని మీరు! ఏ ముఖం పెట్టుకుని మా గ్రామానికి వ‌చ్చారంటూ ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తున్నార‌ని అంటున్నారు. ఇక మ‌రి కొంద‌రేమో టీడీపీలో ఉంటూ మంత్రి ప‌ద‌వులను అనుభ‌విస్తూ త‌మ‌ నియోజ‌కవ‌ర్గంలో అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేయ‌కుండా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి గెలుపుకోసం సహాయం చేస్తున్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి.
 
రాయ‌ల‌సీమ‌లో నాలుగు జిల్లాలు ఉంటే అందులో కేవ‌లం అధికార తెలుగుదేశం పార్టీకి స‌పోర్ట్ గా ఉన్న జిల్లా అనంత‌పురం జిల్లా. అయితే ప్ర‌స్తుతం ఈ జిల్లాలో కూడా టీడీపీకి బీట‌లు వాలే ఛాన్స్ ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇక దీంతోపాటు క‌ర్నూల్ జిల్లా బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌కవ‌ర్గంలో కూడా టీడీపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీటలు వాల‌నున్నాయి అని అంటున్నారు.
 
ఇక ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన ఎమ్మెల్యే జ‌నార్థ‌న రెడ్డి, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకే కొద్ది రోజుల క్రితం ఈ జిల్లాలో నిర్వ‌హించిన మినీ మ‌హానాడు స‌భ‌కు, అలాగే విజయవాడలో జరిగిన స‌భ‌తో పాటు చంద్రబాబు మీటింగులకు రావడం మానేశారు. ఇక ఆయ‌న రాక‌పోవ‌డాన్ని తీవ్రంగా ఖండించిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు డైరెక్ట్ గా బీసీకి కాల్ చేసి ఆయ‌న ఎందుకు రాలేదో అడిగి తెలుసుకున్నారు.
 
తాను వ‌చ్చే ఎన్నికల్లో ఖ‌చ్చితంగా ఓట‌మి చెందుతాన‌ని, బ‌న‌గాన‌ప‌ల్లెలో ప్ర‌జ‌ల‌కు టీడీపీ హామీల‌పై, ప‌రిపాల‌న‌పై వ్య‌తిరేక‌త పెరిగిపోతుంద‌ని చెప్పార‌ట‌. అంతే కాదు త‌న ప్ర‌త్య‌ర్థి కాట‌సాని రామిరెడ్డికి ప్ర‌జా బ‌లం ఎక్కువ అవుతోంద‌ని చెప్పార‌ట‌. ఇక తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేస్తే ఖ‌చ్చితంగా ఓడిపోతాన‌ని చెప్పార‌ట‌. అంతేకాదు కాట‌సాని భూమా బ్ర‌హ్మ‌నంద‌రెడ్డికి స్వ‌యాన‌ మామ కావ‌డంతో పార్టీ కంటే భూమా ఫ్యామిలీ బందుత్వానికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తారు. 
 
అందుకే మంత్రి అఖిల ప్రియ, కాట‌సాని గెలుపుకు సాయం చేస్తున్నార‌ట‌. బ‌న‌గాన‌ప‌ల్లెలో కాంట్రాక్టులను కూడా కాటసాని రామిరెడ్డికి అప్పగించార‌ట‌ అఖిలప్రియ. ఇక‌ ఇదే విష‌యాన్ని బీసీ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి వివ‌రించారు. ఇక ఈ విష‌యంపై చంద్ర‌బాబు స్పందించి అఖిల ప్రియ‌ను అమ‌రావ‌తికి పిలిపించుకుని క్లాస్ తీసుకుంటారా లేక సైలెంట్ గా ఉంటారా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారుతోంది. మొత్తానికి మంత్రి అభిల ప్రియ‌కు వైసీపీ గాలి ఇంకా వ‌దిన‌ట్లు లేదని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.