అఖిలప్రియకు చంద్రబాబు క్లాస్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-13 10:09:44

అఖిలప్రియకు చంద్రబాబు క్లాస్

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకి ఒక స‌మ‌స్య‌ ప‌రిస్కారం దొర‌క‌క ముందే మ‌రో స‌మ‌స్య పుట్టుకొస్తుంది.. సెగ్మెంట్ ల వారిగా పార్టీ ఎమ్మెల్యేల నుంచి టీడీపీ కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కూ త‌మ నియోజ‌కవ‌ర్గంలో త‌న పెత్త‌నం కొన‌సాగాలంటూ టీడీపీ నాయ‌కులు రెచ్చిపోతున్నారు. ఇక ఈ వ‌రుస క్ర‌మంలో చూసుకుంటే క‌ర్నూల్ జిల్లా ఆళ్ల‌గ‌డ్డ పంచాయితీ ఇప్ప‌టికీ చంద్ర‌బాబుకు ప‌రిస్కారం దొర‌క‌లేదు అనేది వాస్త‌వం.
 
గ‌త కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సూచ‌న‌ల మేర‌కు ఏ.వీ సుబ్బారెడ్డి అఖిల ప్రియ ఆళ్ల‌గ‌డ్డ‌లో విడివిడిగా సైకిల్ యాత్ర‌ను చేప‌ట్టారు. ఈ సైకిల్ యాత్ర‌లో ఏ.వీ సుబ్బారెడ్డిని ప్ర‌త్య‌ర్థులు కాపు కాసి అత‌నిపై రాళ్ల‌తో దాడి చేశారు. ఈ దాడిలో సుబ్బారెడ్డి అనుచ‌రుడికి తీవ్ర గాయాలు అయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ దాడి మంత్రి అఖిల ప్రియనే చేయించందంటు ఏ.వీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.
 
ఇక ఈ గొడ‌వ ఈనోట ఆనోట చేరి చివ‌రికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దృష్టికి చేర‌డంతో వారిద్ద‌రిని వెంట‌నే అమ‌రావ‌తికి రావాల‌ని పిలుపునిచ్చారు. వారిద్ద‌రి స‌మ‌క్షంలో ఈ గొడ‌వ ఎందుకు సంబ‌వించిందో అడిగి తెలుసుకున్నారు చంద్ర‌బాబు. ఇక వారి వాద‌న‌లు విన్న త‌ర్వాత వారికి సర్ధి చెప్పి పంపించారు చంద్ర‌బాబు. అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయంలో వారిద్దరి గొడవ ఇంకా పెండింగ్ లో ఉంది. ఈ క్ర‌మంలో ఏ.వీ సుబ్బారెడ్డి త‌న అనుచ‌రుల‌తో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు త‌న‌కే టికెట్ ఇస్తార‌ని చెప్పార‌ని ప్ర‌చారం చేయించారు.
 
ఇక ఈ విష‌యం కాస్త ఆఖిల ప్రియ‌కు తెలియ‌డంతో ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు తెస్తోంది. తాను మంత్రి ప‌ద‌విలో ఉన్నా కూడా త‌న‌కు టికెల్ ఇవ్వ‌కుండా ఏవీ కేటాయిస్తారా అని ఆగ్రహంతో ఉన్న‌ట్లు విశ్లేష‌కులు తెలుపుతున్నారు. అయితే ఈ క్ర‌మంలో మ‌రోసారి చంద్ర‌బాబు అఖిల ప్రియకు క్లాస్ తీసుకున్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి. ఇక వీరిద్ద‌రి స‌మ‌స్య‌ల‌కు చంద్ర‌బాబు చెక్ పెట్టేందుకు ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఆళ్ల‌గ‌డ్డ‌లో తాను ఓ  సర్వే చేయిస్తానని ఎవరికి అనుకూలత ఉంటే వారికే టికెట్ అని చంద్రబాబు వారికి చెప్పాడట. 
 
అయితే చంద్ర‌బాబు అలా చెప్పడమే వారి మధ్యన మ‌రో కొత్త గొడవకు కారణం అవుతోందని రాజ‌కీయ‌ విశ్లేష‌కులు తెలుపుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో సర్వేల్లో అనుకూలత రావాలంటే ఏ.వీ సుబ్బారెడ్డి, అఖిల ప్రియ‌ ఇప్పటి నుంచి నియోజకవర్గంలొ గట్టిగా తిరగాల్సి ఉంటుంది. దీంతో  ఒకే నియోజకవర్గం లో వీరిద్దరి రచ్చ సాగుతోంది. అలాగే సీట్ల గొడ‌వ‌తో పాటు మ‌రోవిష‌యంపై కూడా చంద్ర‌బాబు మంత్రి అఖిల ప్రియ‌ను క్లాస్ తీసుకున్న‌ట్లు తెల‌స్తోంది.
 
అదేంటంటే వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ న‌గ‌రి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా ఎప్ప‌టిక‌ప్పుడు అధికార‌ నాయ‌కులు చేస్తున్న పరిపాల‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటారు. ఇక వారికి సమాధానం చెప్పడానికి తెలుగుదేశం నేతలు సరిగా రియాక్ట్ కావడం లేదు అనేది చంద్రబాబు బాధ. అందులో భాగంగా అఖిలప్రియ కూడా మాట్లాడటం లేదని చంద్రబాబు అనుకుంటున్నాడట. అందుకే ఆమెను గట్టిగా క్లాస్ తీకున్నార‌ని సమాచారం. చంద్ర‌బాబు క్లాస్ తీసుకోవ‌డంతో అఖిల ప్రియ టీడీపీకి గుడ్ బై చెప్పేప‌నిలో ఉన్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.