జ‌గ‌న్ బాట‌లో అన్ని రాజ‌కీయ పార్టీలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-06 10:43:05

జ‌గ‌న్ బాట‌లో అన్ని రాజ‌కీయ పార్టీలు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అవ‌స‌రం అంటూ గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా త‌న పార్టీ త‌రుపున‌ పోరాటాలు చేస్తున్నారు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.  రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి రాజ‌ధాని లేకుండా, ఆర్థిక వెసులుబాటు లేకుండా చేసిన కేంద్రం పై ఏపీకి స్పెష‌ల్ స్టేట‌స్  ప్ర‌క‌టించాలంటూ నిత్యం పోరాటం చేస్తున్నామ‌ని  ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు... రాష్ట్రంలో అన్ని రాజ‌కీయ పార్టీల‌ను కాద‌ని ఢిల్లీ నుంచి గ‌ల్లీ దాకా అన్ని ర‌కాల కార్య‌క్ర‌మాలు చేశామ‌ని అన్నారు.
 
రాష్ట్ర‌ అభివృద్ది, ప్ర‌జా సంక్షేమాన్ని బాధ్య‌త‌గా తీసుకుని ప్రత్యేక హోదాను సాధించుకోవ‌డంలో అధికార టీడీపీ ఘోరంగా విఫ‌లం అయింద‌ని అన్నారు. ఆ బాధ్య‌త‌ను భుజానికి ఎత్తుకుని ప్రతి ఒక్కరి నోటా హోదా మాట అనిపించిన ఘ‌న‌త మా నాయ‌కుడు వైఎస్ జగన్‌కే చెందింద‌ని అన్నారు.  ప్రత్యేక హోదాను కాద‌ని ప్ర‌త్యేక ప్యాకేజీని తీసుకున్న చంద్ర‌బాబు సైతం హోదా కావాల‌ని అడ‌గ‌డం జ‌గ‌న్ చోర‌వే అని అన్నారు.
 
ప్ర‌త్యేక హోదా కోసం ఏప్రిల్ 6న రాజీనామా చేస్తామని దానికి టీడీపీ మ‌ద్ద‌తి ఇవ్వాలంటూ ఎంపీ అవినాష్ రెడ్డి కోరారు. ప్ర‌జ‌లు ఇచ్చిన బాధ్య‌త‌ను నేర‌వేర్చ‌డానికి ప‌ద‌వుల‌కు సైతం రాజీనామా చేయ‌డానికి వైసీపీ సిద్దం అయింద‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.