ప‌వ‌న్ కు వైసీపీ సూటి ప్ర‌శ్న‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-28 17:33:17

ప‌వ‌న్ కు వైసీపీ సూటి ప్ర‌శ్న‌

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు రాష్ట్రంలో జ‌రుగుతున్న స‌మ‌స్య‌లపై ఏ మాత్రం అవ‌గాహ‌న‌ లేకుండా మాట్లాడుతున్నార‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని మండిప‌డ్డారు. ఈరోజు ఏలూరులో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, తుందుర్రు ఆక్వా  విష‌యంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి, అరాచ‌కాల‌కు అడ్డుప‌డుతూ.. అక్క‌డున్న‌టువంటి ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తున్నది కేవలం ఒక్క జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రమే అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అయితే ఈ విష‌యాన్ని ప‌వ‌న్ గుర్తించాల‌ని నాని తెలిపారు. 
 
అంతేకాదు తుందుర్రు ఆక్వా  విషయంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న వైఖ‌రిని చూసి ఆ ప్రాంత ప్ర‌జ‌లు వైఎస్ జ‌గ‌న్ కు వివ‌రిస్తే వెంట‌నే ఆయ‌న ఈ విష‌యంపై ఎలాంటి ప‌త్రికా స‌మావేశం పెట్ట‌కుండా రాష్ట్ర ప్ర‌భుత్వం పై పోరాటం చేశారని ఆయ‌న గుర్తు చేశారు. అలాగే జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా తుందుర్రులో బ‌హిరంగ సభ‌లో జ‌గ‌న్ మాట్లాడుతూ 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే ఖ‌చ్చితంగా  తుందుర్రు ఆక్వా ను బంగాళాఖాతంలో క‌లిపేస్తాన‌ని చెప్పార‌ని నాని తెలిపారు. 
 
ఆక్వా విష‌యంలో త‌మ నాయ‌కుడు పోరాటం చేసి ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇచ్చారు.. మ‌రి మీరు తుందుర్రు ప్ర‌జ‌ల‌కు ఏం చేశారు... అని పార్టీ త‌రుపున ప‌వ‌న్ ను  ప్ర‌శ్నించారు నాని. మిత్ర‌ప‌క్షంలో ఉన్న‌టు వంటి మీరు తుందుర్రు విషయంలో నివాసంలో, పార్టీ కార్యాలయంలో గ్రామ‌స్తులు మిమ్మ‌ల్ని క‌లిశారు కానీ ఈ స‌మ‌స్య‌పై మీరు స్పందించ‌లేదు. తాము చేసే ఈ పోరాటంలో న్యాయం ఉంటేనే త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని ప్ర‌జ‌లే వేడుకుంటే అందుకు ప‌వ‌న్ బ‌దులిస్తూ తాను అక్కిడికి చేరుకుంటే శాంతి బ‌ద్ర‌త‌ల‌కు భంగం క‌లుగుతుంద‌ని చెప్పి ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దృష్టికి తీసుకువెళ్తాన‌ని చెప్పి త‌ప్పించుకున్నార‌ని నాని మండిప‌డ్డారు. 
 
భీమ‌వ‌రంలో నాలుగు రోజుల పాటు ప‌ర్య‌టించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్క‌రోజు అయినా తుందుర్రులో ప‌ర్య‌టించారా అని ప్ర‌శ్నించారు. అధికారంలో లేకున్నా కూడా అభివృద్దికి పునాదులు వేసింది వైసీపీనే అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇక నుంచి అయినా ప‌వ‌న్ వాస్తవాల‌ను దృష్టిలో ఉంచుకుని స‌భ‌ల్లో మాట్లాడాల‌ని ఆళ్ల నాని స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.