ఆళ్లగడ్డ టీడీపీలో మూడో వ‌ర్గం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-19 16:19:12

ఆళ్లగడ్డ టీడీపీలో మూడో వ‌ర్గం

రాష్ట్రంలోనే వర్గపోరుకు అడ్డా...  ఆళ్లగడ్డ... ఈ వర్గపోరుతోనే అఖిల ప్రియకు ఆళ్లగడ్డలో చుక్కెదురు కానుందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు..గతంలో భూమాకు వెన్నంటే ఉండి అన్ని రకాలుగా సహాయంగా నిలుస్తూ వారి గెలుపుకి ముఖ్య భూమిక పోషించారు ఏ.వీ సుబ్బారెడ్డి. ఇప్పుడు ఏవీ సుబ్బారెడ్డికి అఖిల ప్రియకి మధ్య దూరం పెరగడంతో రెండు వర్గాలుగా చీలి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు..ఈ విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకుని మందలించినప్పటికీ వీరి మధ్య సఖ్యత కుదరడం లేదు...
 
ఏ.వీ సుబ్బారెడ్డికి  మంత్రి అఖిల ప్రియకి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని బహిరంగంగానే మీడియా ముందుకు వచ్చి చెప్పుకున్నారు...వీళ్లిద్దరి మధ్య చంద్రబాబు పంచాయతీ చేసినప్పటికీ, చంద్రబాబు మాట లెక్క చేయకుండా మాటలనుంచి దాడులు చేసుకునే వరకు వెళ్లారు ఏ.వీ సుబ్బారెడ్డి - మంత్రి అఖిల ప్రియ.
 
ఇదే అనుకుంటే టీడీపీలో మరో మూడో వర్గం కూడా తయారైంది, భూమా ఫ్యామిలీకి ప్రత్యర్థిగా ఉన్న ఇరిగల రాంపుల్లా రెడ్డి కూడా ప్రజల్లో తిరుగుతూ తన వర్గాన్ని పెంచుకుంటూ అఖిలకి, సుబ్బా రెడ్డికి దీటుగా ఎదుగుతున్నారు...గతం కంటే కూడా ఆర్థికంగా ఎదిగిన ఇరిగల రాంపుల్లా రెడ్డి వర్గం కూడా ఆళ్లగడ్డలో ప్రభావితం చేసే విధంగా తయారైంది...
 
ఇలా టీడీపీ మూడు వర్గాలతో కొట్టుమిట్టాడుతుంటే...మరో వైపు వైసీపీ మాత్రం తన జోరు పెంచుకుంటుంది..వైసీపీ యువనాయకుడు గంగుల నాని కార్యకర్తలను అందరిని కలుపుకుంటూ, తన హవాని పెంచుకుంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు..టీడీపీ లో జరుగుతున్న వర్గ పోరు ఇలాగే కొనసాగితే భూమా అఖిల ప్రియపై గంగుల నాని విజయం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.