అక్క‌డ గెల‌వ‌డం క‌ష్ట‌మే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-21 18:30:34

అక్క‌డ గెల‌వ‌డం క‌ష్ట‌మే

2019 సార్వ‌త్రిక‌ ఎన్నిక‌లు ద‌గ్గర ప‌డుతున్న‌త‌రుణంలో టీడీపీ నాయ‌కుల్లో టెన్ష‌న్ రోజు రోజుకు పెరిగిపోతుంది. త‌మ‌కు పార్టీ త‌ర‌పున అధిష్టానం టికెట్ కేటాయిస్తుందో లేదో అన్న నేప‌థ్యంలో  టీడీపీ నాయ‌కులు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో చ‌ర్చించుకుంటున్నారు.ఇక ప్ర‌స్తుతం ఈ క‌థ‌ను అలా ఉంచితే, 2019 ఎన్నిక‌ల‌కు టీడీపీ త‌ర‌పున సీటు ఫిక్స్ అయిన వారి స‌మ‌మ‌స్య ఇప్పుడు కొత్త‌గా తెర‌పై క‌నిపిస్తోంది. 
 
ఎన్నో ఏళ్ల నుంచి కర్నూల్ జిల్లా ఆళ్ల‌గ‌డ్డ త‌రపున ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ఫ్యామిలీ భూమా ఫ్యామిలీ. అయితే ప్ర‌స్తుత రాజ‌కీయ స‌ర్వే ప్ర‌కారం ఈ ఫ్యామిలీకి బీట‌లు వాలే ప‌రిస్థితి ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది. ఆళ్ల‌గ‌డ్డ నుంచి భూమా ఫ్యామిలీలో  2019 ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటీ చేసినా ఓట‌మి పాలు కావ‌డం ఖాయం అని తాజాగా ఓ స‌ర్వే తెలిపింది. 
 
అఖిల ప్రియ ఆళ్ల‌గ‌డ్డ నుంచి గెలిచి నాలుగేళ్లు గ‌డిచాయి. ఆ త‌ర్వాత టీడీపీలోకి ఫిరాయించి మంత్రి అయి సుమారు ఏడాది గ‌డిచినా నియోజ‌కవ‌ర్గంలో ఒక్క చోట కూడా అభివృద్ది కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌లేదు. దీంతో ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే నిలిచిపోయాయి. ఈ క్ర‌మంలో భూమా ఫ్యామిలీ పై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి తీవ్ర స్థాయిలో నెల‌కొంది.
 
ఇక దీనికి తోడు తండ్రి లాంటి వ్య‌క్తి ఏవీ సుబ్బారెడ్డి పై దాడి చేయించ‌డం వంటి అంశాల‌ను ప్ర‌జ‌లు త‌ప్పుబ‌డుతున్నారని విశ్లేష‌కులు తెలుపుతున్నారు. ఇక ఇటువంటి ప‌రిస్థితిలో అఖిల ప్రియ ఆళ్ల‌గ‌డ్డ నుంచి పోటీ చేస్తే క‌చ్చితంగా ఓట‌మి పాలు కావ‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు తెలుపుతున్నారు. ఇన్నిరోజులు త‌మ తల్లిదండ్రుల అండ‌తో గెలిచార‌ని అయితే ఇప్పుడు ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.