అంబ‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-25 10:51:35

అంబ‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి  చంద్ర‌బాబు పై మీడియా సాక్షిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధికార ప్ర‌తినిధి అంబటి రాంబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు... 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అధికారం చేప‌ట్టాకా విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న ప్ర‌త్యేక హోదాను తుంగ‌లో తొక్కి ప్ర‌త్యేక ప్యాకేజీకి మ‌ద్ద‌తు ఇచ్చారన్నారు అంబటి రాంబాబు.
 
కోట్ల రూపాయ‌ల‌కు చంద్ర‌బాబు కేంద్రానికి అమ్మ‌డు పోయి ప్ర‌త్యేక హోదా కంటే, ప్ర‌త్యేక ప్యాకేజీ వ‌ల్ల అధిక లాభం ఉంటుంద‌ని, ప్ర‌జ‌ల‌కు నాలుగు మాయ‌మాట‌లు చెప్పి రాష్ట్రానికి తీర‌ని అన్యాయం చేశార‌ని అంబటి రాంబాబు అన్నారు.. అయితే గ‌తంలో ప్ర‌త్యేక హోదా వ‌ల్ల లాభం లేద‌న్న చంద్ర‌బాబు... ఇప్పుడు మ‌ళ్లీ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాలంటూ కేంద్రాన్ని వ్య‌తిరేకించ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని అన్నారు.
 
2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో మ‌ఖ్య‌మంత్రి మాట మార్చుతున్నార‌ని అంబటి ఎద్దేవా చేశారు... ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి మోసాలను ఎలా చేయాలో, బాబు ద‌గ్గ‌రే నేర్చుకోవాల‌ని అంబటి ఆరోపించారు... అయితే ఈ క్ర‌మంలో ప్ర‌త్యేక హోదాను బ్ర‌తికించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉధ్య‌మాలు చేస్తున్నార‌ని అంబటి వెల్ల‌డించారు.
 
ఈ క్ర‌మంలో ప్రత్యేక హోదా ఉద్యమం రాష్ట్ర‌వ్యాప్తంగా విస్రృతంగా క‌నిపిస్తున్న‌ సమయంలో చంద్రబాబు మరోనాటకానికి తెరలేపుతున్నారని, ఇప్పుడు ప్ర‌త్యేక ప్యాకేజీ పోయి... ప్రత్యేక హోదా మాట‌ను అందుకుంటున్నార‌ని అంబటి అన్నారు... గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు ఒక్కసారైనా రాష్ట్రానికి  ప్రత్యేక హోదా కావాలంటూ కేంద్రాన్ని ప్రశ్నించారా అని అన్నారు... గతంలోడ్రామాలు ఆడిన చంద్రబాబుకు ఏగతి పట్టిందో ఇప్పుడు అదే గ‌తి  రానున్న రోజుల్లో బీజేపీ, టీడీపీకి పడుతుంద‌ని అంబటి ఫైర్ అయ్యారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.