ముద్ర‌గ‌డ ఆ విష‌యాన్ని మ‌రిచారు అంబ‌టి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ambati rambabu
Updated:  2018-07-30 05:53:59

ముద్ర‌గ‌డ ఆ విష‌యాన్ని మ‌రిచారు అంబ‌టి

ప్ర‌తిపక్ష‌నేత  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా కాపుల‌కు ఇచ్చిన హామీల‌ను గురించి కొంత‌మంది నేత‌లు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబంటి రాంబాబు మండిప‌డ్డారు.
 
ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, జ‌గ‌న్ స‌భా ముఖంగా మాట్లాడిన మాట‌ను ఆస‌రాగా చేసుకుని రాజ్యాంగ ల‌బ్ది పొందేందుకు కొన్ని శ‌క్తులు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.
 
నాటి వైఎస్ హయాం నుంచి నేటి ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ర‌కు కాపుల‌కు అండ‌గా నిలుస్తున్నార‌ని అంబ‌టి స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యం ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని ఆయ‌న పేర్కొన్నారు. త‌మ నాయ‌కుడు ఏదైనా హామీ ఇస్తే వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తే లేద‌ని ఇచ్చిన మాట వ‌మ్ముచేయ‌డం వైఎస్ కుటుంబంలో లేద‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే నిన్న కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మాట్లాడ‌టం దారుణం అని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 
 
గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కాపుల‌ను బీసీల్లో చేర్చుతామ‌ని చెప్పి అమ‌లు కానీ హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చార‌ని అంబ‌టి మండిప‌డ్డారు. అయితే చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌పై ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం నిరాహార దీక్ష చేసేంత వ‌ర‌కు అధికారుల‌కు గుర్తుకు రాలేద‌ని అంబ‌టి విమ‌ర్శ‌లు చేశారు. 
 
రిజ‌ర్వేష‌న్ల‌పై ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కుటుంబ స‌భ్యుల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు హౌస్ అరెస్ట్ చేసిన‌ప్పుడు ఆ కుటుంబానికి అండ‌గా నిలించింది ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డే అని ఆయ‌న గుర్తు చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే ఖ‌చ్చితంగా జ‌గ‌న్ ఏదైతే హామీ ఇచ్చారో అది ఖ‌చ్చితంగా నెర‌వేర్చుతార‌ని అంబటి రాంబాబు స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.