బాబుకు అంబ‌టి కౌంట‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-22 05:46:31

బాబుకు అంబ‌టి కౌంట‌ర్

తెలుగుదేశం అధినేత సీఎం చంద్ర‌బాబుపై వైసీపీ నాయ‌కులు తాజాగా ఫైర్ అవుతున్నారు.. ఓపక్క ఏపీ ప‌రిస్దితిపై, సీఎం చంద్ర‌బాబు మెత‌క వైఖ‌రిపై, కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌ని బాబు రాజ‌కీయం పై, ఇటు రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ లేఖ రాసిన విష‌యం తెలిసిందే.
 
ఇక తాజాగా చంద్ర‌బాబు నాయుడి పై,  వైసీపీ నాయకుడు  వైఎస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి అంబ‌టి రాంబాబు ఫైర్ అయ్యారు... బాబు విధానాల పై తెలుగుదేశం స‌ర్కార్ అవ‌లంభిస్తున్న ప‌ద్ద‌తి పై ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.. స్వ‌లాభం కోసం ఎలాంటి ప‌నుల‌కైనా ఏపీని తాకట్టు పెడుతున్నార‌ని.. కృష్ణ‌ప‌ట్నం పోర్డులో లాభార్జ‌న కోసం చంద్ర‌బాబు నాయుడు దుగ‌రాజుప‌ట్నం  వ‌దులుకున్నారు అని విమ‌ర్శ‌లు చేశారు అంబ‌టిరాంబాబు.
 
సంపాద‌నే ల‌క్ష్యంగా మంత్రి వ‌ర్గ నిర్ణయాలు ఉంటున్నాయి అని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు... కీలక ప్రాజెక్ట్‌ల విషయంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడం లేదని అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.