అవిశ్వాసానికి డేట్ ప్ర‌క‌టించిన వైసీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-20 01:03:59

అవిశ్వాసానికి డేట్ ప్ర‌క‌టించిన వైసీపీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌నం చోటు  చేసుకుంది. కేంద్ర‌ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించ‌క‌పోవడంతో అన్ని రాజ‌కీయ పార్టీలు ఆగ్ర‌హంతో ఉన్నాయి. ఈ క్ర‌మంలో అవిశ్వాస తీర్మానం అంశాన్ని తెరపైకి తీసుకువ‌చ్చారు ఏపీ రాజ‌కీయ నాయ‌కులు. 
 
ప‌వ‌న్ స‌ల‌హా మేర‌కు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు తాము సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించిన వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ వ‌చ్చే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో  కీల‌క పాత్ర పోషించ‌నుంది. ఈ విష‌యంపై  వైసీపీ సీనియర్ నేత, అధికార ప్ర‌తినిధి  అంబ‌టి రాంబాబు పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. 
 
మార్చి ఐద‌వ తేదీ నుండి త‌మ పార్టీకి చెందిన ఎంపీలు పార్ల‌మెంట్ లో ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తారని, మార్చి 21న అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెడ‌తామంటూ అంబ‌టి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్య‌లు చిన్న పిల్లాడిలా ఉన్నాయంటూ అంబ‌టి వ్యంగ్యాస్త్రాలు వ‌దిలారు.
 
అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌మ‌ని స‌వాల్ విసిరింది ముందు ప‌వ‌న్ కళ్యానే అని, ఆయ‌న స‌ల‌హాను స్వీక‌రించి జ‌గ‌న్  మోహ‌న్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ముందుకు వ‌చ్చార‌ని అంబటి గుర్తు చేశారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో సంబంధం లేకుండా త‌మ వ్యూహాల‌తో హోదా కోసం పోరాటం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు అంబ‌టి. ఈ దెబ్బ‌తో ఏపీలో ఎవ‌రి స‌త్తా ఏంటో తేలిపోనుంద‌న్న‌మాట‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.