సమస్యగా మారుతున్న టీడీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-25 18:04:26

సమస్యగా మారుతున్న టీడీపీ

చంద్రబాబు టీడీపీ పగ్గాలు చేప్పటినప్పటి నుంచి ఇప్పటివరకు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిన సందర్భాలు ఒకటి కూడా లేవని ఎద్దేవా చేశారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు...ప్రతి ఎన్నికల్లో ఎదో ఒక పార్టీతో పోతు పెట్టుకొని, ఆ పార్టీ అవసరం తీరిన తర్వాత వారిపైన విమర్శలు చేయడం బాబుకు అలవాటు...ఇప్పుడు టీడీపీ పొత్తు కోసం వెంపర్లాడుతున్న, ఒక పార్టీ కూడా ముందుకు రావడం లేదని ఎద్దేవా చేశారు.
 
చంద్రబాబు, కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్ళింది కాంగ్రెసుతో  పొత్తుల కోసమే...చంద్రబాబు కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడానికి ఆరాటపడుతున్నారు.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఈ విషయం తెలిస్తే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందని అన్నారు అంబటి రాంబాబు...కాంగ్రెస్ కి చంద్రబాబు రాజకీయాలు అన్ని తెలుసు, కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పొత్తుపెట్టుకోవడానికి సిద్ధంగా లేదని అన్నారు...
 
ఎన్టీఆర్ ఒక సిద్దాంతం కోసం టీడీపీని స్థాపించారు...కానీ చంద్రబాబు పగ్గాలు చేప్పట్టిన తర్వాత ఆ పార్టీ సిద్దాంతాలు మారిపోయాయి...ఇప్పుడు టీడీపీ సిద్ధాంతం ఏంటో తెలుసా? కేవలం పొత్తులు పెట్టుకోవడమే టీడీపీ సిద్దాంతం అని మండిపడ్డారు...ప్రజల సమస్యల కోసం పుట్టిన పార్టీని నాశనం చేసి, ప్రజలకు టీడీపీ నాయకులే సమస్యగా మారుతున్నారని అన్నారు అంబటి రాంబాబు.
 
2009 నుండి 2014 వరకు ఉమ్మడి ఏపీలో సుమారు 46 చోట్ల ఉపఎన్నికలు జరిగాయి...అందులో సుమారు 23 చోట్ల టీడీపీకి డిపాజిట్లు కూడా రాలేదు..ఇప్పుడు టీడీపీ ధర్మ పోరాట దీక్ష చేస్తుంది, కేవలం ప్రజలను మోసం చేయడానికే అన్నారు...ఒక వైపు రాష్ట్రాన్ని దోచుకుంటూ, మరో వైపు ధర్మ పోరాటం అంటూ అందరిని మధ్యపెడుతున్నారని మండిపడ్డారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.