ఆ విష‌యం పై అంబ‌టి క్లారిటీ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp leader ambati rambabu
Updated:  2018-04-28 06:05:44

ఆ విష‌యం పై అంబ‌టి క్లారిటీ ?

గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను చంద్ర‌బాబు నెర‌వేర్చ‌కుండా రాజ‌కీయాలు చేస్తున్నారు అని, కేంద్రంతో ఇప్ప‌టి వ‌ర‌కూ స‌యోధ్య‌గా ఉండి  ఎన్నిక‌ల‌కు ఓ సంవ‌త్స‌రం ముందు బ‌య‌ట‌కు వ‌చ్చి చంద్ర‌బాబు కొత్త రాజ‌కీయాలు చేస్తున్నారు అని వైసీపీ విమ‌ర్శిస్తోంది..
 
గత ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌కుండా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. పాదయాత్ర సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు కాలేదంటూ అంబటి విమర్శించారు.
 
దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిలు మండుటెండల్లో పాదయాత్రలు చేస్తున్నారని, కానీ చంద్రబాబు మాత్రం రాత్రి సమయాల్లో యాత్ర చేశారని ఎద్దేవా చేశారు. బాబు పాద‌యాత్ర ఎలా చేశారో గుర్తు తెచ్చుకోవాల‌ని ప్ర‌శ్నించారు..
 
ప్రజాసంక్షేమం కన్నా కుటుంబ సంక్షేమమే ముఖ్యమని నమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అంబటి విమ‌ర్శించారు కుంభకోణాలు, అవినీతితో సంపాదించిన డబ్బుతో రానున్న ఎన్నికల్లో నారా లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలకుంటున్నారని  ఇది సాధ్యం కాని ప‌ని అని విమ‌ర్శ‌లు చేశారు ఆయ‌న‌.రాష్ట్రానికి టీడీపీ, బీజేపీ రెండూ అన్యాయం చేశాయి అని అన్నారు... చంద్ర‌బాబు యూట‌ర్న్ ఏపీలో అంద‌రూ చూశారు అని అన్నారు ఆయ‌న‌..పార్ల‌మెంట్లో జ‌రిగింది కూడా అంద‌రికి తెలుసు అని ఆయ‌న విమ‌ర్శించారు..
 
ఇక వైసీపీ పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు తాము వేరే ఓ పెద్ద పార్టీతో క‌లిసి పోతాము అంటున్నారు ఇది అంతా అవాస్త‌వం అని అన్నారు ఆయ‌న‌..వైఎస్సార్‌ సీపీ రానున్న ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీతోను కలిసి పోటీ చేయదని అంబటి స్పష్టం చేశారు. తమ పార్టీ సూర్యుడి లాంటిదని, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా స్వయంగా, స్వతంత్రంగానే పోటీచేస్తుందని ఆయ‌న తెలియ‌చేశారు... టీడీపీకి పొత్తుల్లేకుండా పోటీ చేసిన చరిత్ర లేదని, ఆ ధైర్యం తెలుగుదేశం పార్టీకి లేదని ఎద్దేవా చేశారు. 
 
ఇక టీటీడీ బోర్డులో బీజేపీకి చెందిన వాళ్లకు పదవులు ఇచ్చి మళ్లీ మోదీని కాకాపట్టే పనిలో ఉన్నారంటూ విమర్శించారు. సుజనా చౌదరి, సీఎం రమేష్‌ ఢిల్లీలో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటున్నారని అంబ‌టి రాంబాబు విమ‌ర్శించారు.. నిజ‌మే బీజేపీ తో క‌టీఫ్ అని టీటీడీ బోర్డు ప‌ద‌వులు ఎలా ఇచ్చారు అనేదానికి తెలుగుదేశంస‌మాధానం చెప్పాలి అని కోరుతున్నారు కొంద‌రు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.