ప్ర‌త్యేక హోదా ఆయ‌న వల్లే సాధ్యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysr congress party
Updated:  2018-08-09 05:38:47

ప్ర‌త్యేక హోదా ఆయ‌న వల్లే సాధ్యం

2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో  విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదాను బీజేపీ అధికారంలోకి వ‌స్తే ఐదు సంవ‌త్స‌రాలు కాదు ప‌ది సంవ‌త్స‌రాలు కేటాయిస్తామ‌ని తిరుమ‌ల సాక్షిగా నరేంద్ర మోడీ చెప్పార‌ని,  త‌మ‌కు 10 సంవ‌త్స‌రాలు కాదు 15 సంవ‌త్స‌రాలు ప్ర‌త్యేక‌ హోదా కావాల‌ని చెప్పి అధికారంలోకి వ‌చ్చిన కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు దాని ఊసే ఎత్త లేద‌ని వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు అంబ‌టి రాంబాబు ఆరోపించారు.
 
ఈ రోజు వైసీపీ నాయ‌కులు ఏర్పాటు చేసిన‌ వంచ‌న‌పై గ‌ర్జ‌న దీక్ష‌లో ఆయ‌న మట్లాడుతూ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక మాట అధికారంలో లేన‌ప్పుడు ఒక మాట మాట్లాడ‌టం ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్యని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌త్యేక హోదాను నాలుగు సంవ‌త్స‌రాల‌ నుంచి కాపాడుకుంటూ వ‌స్తోంది జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డినే అని ఆయ‌న గుర్తు చేశారు. 
 
గతంలో చంద్ర‌బాబు నాయుడు కేంద్ర ప్ర‌భుత్వంతో  మిత్రప‌క్షం వ్య‌వ‌హ‌రించి ప్ర‌త్యేక హోదా బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజికి జై కొట్టార‌ని, అయితే ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న‌త‌రుణంలో హ‌డావిడిగా యూట‌ర్న్ తీసుకుని కేంద్రానికి విడాకులు ఇచ్చి తాము కూడా ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేస్తున్నామ‌ని చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అంతేకాదు కుట్ర రాజ‌కీయాలు, న‌మ్మ‌క ద్రోహం పేరుతో ప్ర‌జా ధ‌నాన్ని వెచ్చించి దీక్ష‌ల పేరుతో విచ్చ‌ల విడిగా ఖ‌ర్చు చేస్తున్నార‌ని అంబ‌టి మండిప‌డ్డారు.  
 
గ‌తంలో చంద్ర‌బాబు వైసీపీ ఎంపీలు కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టిన‌ప్పుడు మ‌ద్ద‌తు తెలిపి త‌మ ఎంపీల‌తో రాజీనామా చేయించి ఉంటే ప్ర‌త్యేక హోదాపై చ‌ర్చ జ‌రిగేద‌ని అంబ‌టి స్ప‌ష్టం చేశారు. త‌మ అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో తాము కూడా కేంద్రానికి వ్య‌తిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టామ‌ని చెప్పి ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని అంబ‌టి మండిప‌డ్డారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా రావాలంటే ఒక్క‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ల్లే సాధ్యం అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.