అంబటి వార్నింగ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-20 10:43:15

అంబటి వార్నింగ్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశంపార్టీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడుపై అలాగే ఆ పార్టీ నేత‌ల‌పై మ‌రోసారి  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు మీడియా స‌మ‌క్షంలో మండిప‌డ్డారు... కొద్ది కాలంగా తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ పేరుతో మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపులు జ‌రుగుతున్నాయంటూ న‌టి శ్రీరెడ్డి సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని న‌టుల పేర్లను ఒక‌టి తర్వాత ఒక‌టి లీక్ చేస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా శ్రీరెడ్డిని వైసీపీ నాయ‌కులు వెన‌కుండి ఇలాంటి  ప్ర‌చారం చేయిస్తున్నార‌ని,  ఈ రోజు అధికార పార్టీకి  చెందిన ఆస్ధాన మీడియాలో ఓ క‌థ‌నం ద్వారా తెలిపింది.. అయితే ఈ క‌థ‌నం పై వైసీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు స్పందించారు... ఈ రాష్ట్రంలో ఎవరు ఏం చేసినా దాని వెనుక వైసీపీ ఉందని ప్రచారం చేయడం చాలా కాలంగానే సాగుతోందన్నారు. దయచేసి ఇలాంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు... ఇదంతా చంద్ర‌బాబు నాయుడు టీడీపీ నాయ‌కులు కావాల‌నే చేయిస్తున్నార‌ని అంబటి మండిప‌డ్డారు.
 
త‌మ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి అశేష స్పంద‌న‌ను  చూసి టీడీపీ నాయ‌కులు స‌హించ‌లేక వైసీపీ పై బుర‌ద‌జ‌ల్లుతున్నార‌ని మండిప‌డ్డారు... అలాగే మీడియా ప్ర‌తినిధులు వార్త‌ల‌ను ప్ర‌చారం చేసేముందు అది ఎంత‌వ‌ర‌కు క‌రెక్టో తెలుసుకొని ప్ర‌చురించాల‌ని కోరారు అంబటి.
 
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ అని… చంద్ర‌బాబు నాయుడు పార్టీ లాగా ఎవ‌రో స్థాపించిన పార్టీని లాక్కుని త‌న పార్టీలాగా ప్ర‌చారం చేసుకునే త‌త్వం త‌మ పార్టీ అధినేత‌కు లేద‌ని ప్ర‌శ్నించారు..తాము ఏదైనా చెప్పాలనుకుంటే సూటిగా, ప్ర‌జ‌లంద‌రి స‌మ‌క్షంలో బహిరంగంగానే చెప్పే పార్టీ వైసీపీదని అన్నారు..
 
అలాగే ఈ రోజు కోడెల శివ‌ప్ర‌సాదరావు సైకిల్ ర్యాలీ నిర్వ‌హించ‌డంపై అంబ‌టి రాంబాబు మండిప‌డ్డారు.. కోడెల శివప్రసాదరావు ఒక స్పీకర్ గా కాకుండా టీడీపీ నేతగా వ్యవహరిస్తున్నారని,పార్టీ జెండా కట్టుకుని ఒక స్పీకర్ సైకిల్ తొక్కడం సంప్రదాయాలకు విరుద్దమని  అన్నారు...తాను కోడెల గురించి త్వరలోనే పూర్తి స్థాయిలో మాట్లాడుతానని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.