జ‌గ‌న్ కు బాబుకు అదే తేడా అంబటి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-30 19:25:19

జ‌గ‌న్ కు బాబుకు అదే తేడా అంబటి

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత అధికార ప్ర‌తినిధి అంబటి రాంబాబు మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు... ప్ర‌త్యేక హోదా కోసం చంద్ర‌బాబు రోజుకొక మాట మార్చుతూ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని అంబ‌టి మండిప‌డ్డారు... ఆయ‌న ఈ రోజు చేప‌ట్ట‌బోయే ద‌ర్మ‌పోరాట దీక్ష చేసే ముందు రాష్ట్ర ప్ర‌జ‌లకు క్ష‌మాప‌న చెప్పి దీక్ష చేయాల‌ని అన్నారు.
 
ప్ర‌త్యేక హోదాకోసం పోరాడుతున్న వారిపై చంద్ర‌బాబు అక్ర‌మంగా కేసులు పెట్టిన రోజే వంచ‌న దినం అని అంబటి రాంబాబు అన్నారు.. కేంద్రంతో మిత్ర ప‌క్షంగా  వ్య‌వ‌హ‌రించిన‌ప్పుడు ప్ర‌త్యేక హోదా చంద్ర‌బాబుకు గుర్తుకు రాలేదా అని ప్ర‌శ్నించారు... ఇప్పుడు మ‌ళ్లీ 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో కేంద్రంతో క‌టీఫ్  చెప్పి రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాలంటూ దొంగ దీక్ష‌లు చేస్తున్నార‌ని అంబటి ఆరోపించారు.
 
తమ అనుకూల మీడియాలో టీడీపీ నాయ‌కులు నీతికి నిజాయితీకి మారుపేరని, నిప్పులాంటి వాళ్లమంటూ డబ్బా కొట్టుకుని ప్ర‌చారం చేసుకునే చంద్ర‌బాబు ఇప్పుడు త‌న‌ను ఎక్కడ  జైలులో వేస్తారేమోనని భయపడిపోతున్నారని అంబ‌టి విమర్శించారు...  నిజాయితీ గ‌ల చంద్ర‌బాబు అవినీతిపై  కేంద్రం కేసులు పెడితే ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని ప్ర‌శ్నించారు... చంద్ర‌బాబు అవినీతికి పాల్ప‌డ్డారు కాబ‌ట్టే కేసుల‌కు భ‌య‌ప‌డుతున్నార‌ని అంబటి అన్నారు.
 
త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోనియా గాంధీని సైతం లెక్క‌చేయ‌కుండా వ్యతిరేకించార‌ని గుర్తు చేశారు...దీంతో సోనియా గాంధీ తన మాట వినలేదని అక్రమంగా కేసులు పెట్టి, 16 నెల‌లు జైలులో ఉంచినా, వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొన్న ధీరుడు వైఎస్‌ జగన్‌ అని అన్నారు. చంద్రబాబులా భయపడలేదని అంబ‌టి రాంబాబు అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.