లోకేశ్ కు అంబ‌టి వార్నింగ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ambati-warning-to-lokesh
Updated:  2018-04-08 07:14:58

లోకేశ్ కు అంబ‌టి వార్నింగ్

ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం తారాస్థాయికి చేరుకోవ‌డ‌వ‌డంతో ఇటు అధికార తెలుగులేశం పార్టీ నాయ‌కులు అటు ప్ర‌తిప‌క్ష వైసీపీ నేత‌లు క‌లిసి ఒక‌రిపై ఒక‌రు మాట‌ల తూటాలు పేల్చ‌కుంటున్నారు... ఇక  ఈ త‌రుణంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో అధికార తెలుగు దేశం నాయ‌కులు ఎక్క‌డ త‌మ‌కు అనుకూల మీడియా దొరికితే అక్క‌డ ఇస్టానుసారం ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డుతున్నారు.
 
అందులో బాగంగానే ప్ర‌త్యేక హోదా విష‌యంలో కూడా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు కేంద్రంతో లింకు పెట్టుకుని వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు మంత్రి లోకేశ్ త‌మ అనుకూల మీడియా ద్వారా ప్ర‌చారం చేస్తున్నారు..అయితే ఇదే విష‌యాన్ని వైసీపీ అధికార ప్ర‌తినిధి అంబటి రాంబాబు తుప్పుబ‌ట్టారు.. గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా కేంద్రంతో మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించిన మీరు... ఇప్పుడు వైసీపీ నేత‌లు పరోక్షంగా మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న‌టం చాలా సిగ్గుచేట‌ని అంబ‌టి ఆరోపించారు... 
 

 

ఒక‌వేల తాము కేంద్రంతో మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తే అవిశ్వాస తీర్మ‌నం ఎందుకుపెడ‌తామ‌ని అన్నారు.. అడుగడుగునా దుర్మార్గపు రాజకీయాలు చేస్తోన్న మీ నాన్న‌ చరిత్రహీనుడిగా మిగలడం ఖాయమని ఆయన అన్నారు. హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, కేవలం మీడియాలో వార్తల కోసమే ఆయన ఉత్తుత్తి ఉద్యమాలు చేస్తున్నారని మండిపడ్డారు. నమ్మినవారిని నట్టేటముంచే చంద్రబాబుపై ప్రజలకు ఎప్పుడో నమ్మకంపోయిందని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.