అమిత్ షా పిలుపు కొత్త వ్యూహాం...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-17 12:14:30

అమిత్ షా పిలుపు కొత్త వ్యూహాం...

కొన్ని వ‌దిలితే కాని కొంత మందికి మంచి జ‌ర‌గ‌దు అంటారు... అదే ఫార్మూలా పాటిస్తోంది బీజేపీ .. తెలుగుదేశం బ‌య‌ట‌కు వెళ్ల‌డంతో,  శివ‌సేన‌లాంటి మాంచి ప‌ట్టున్న‌పార్టీ వెళ్లిపోయిన‌ప్పుడే బాధ‌ప‌డ‌ని షా మోదీలు ఇప్పుడు ఎన్డీయే నుంచి తెలుగుదేశం వెళితే ఏమైనా కుప్ప‌కూలి నీర‌సించి బ్ర‌తిమాల‌తారా.. నో వే అంటున్నాయి బీజేపీ వ‌ర్గాలు. ఈ మీడియా మేనేజ్ మెంట్ ఏమిటో ఏపీలో తెలియడం లేదు అని, ఇది ఇప్ప‌టికీ మోదీకి - షాకి కూడా అంతుచిక్క‌ని రహ‌స్యం.
 
తెలుగుదేశం బీజేపీకి క‌టీఫ్ చెప్ప‌డంతో రాజ‌కీయం కాస్త వేడెక్కింది.. తెలుగుదేశం పార్టీలోనే ఆవేడి అని బీజేపీ కౌంట‌ర్ ఇస్తోంది.. కాని తెలుగుదేశం నాయ‌కులు మాత్రం దేశంలో ఆర్దిక ప్ర‌కంప‌న‌లు రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మొత్తం మారిపోతున్నాయి అని, మోదీని ఢీకొట్టే నాయ‌కుడు చంద్ర‌బాబే అని అంటున్నారు.. సో ఏకంగా స్టాక్ మార్కెట్ కూడా క‌నీవీనీ ఎరుగ‌ని రీతిలో బాబు బ‌య‌ట‌కు రావ‌డం వ‌ల్ల కుప్ప‌కూలిపోయాయ‌ట‌.. ఇది ఎల్లో మీడియా అరాచ‌క వార్తా ప్ర‌క‌ట‌న‌.
 
ఇక బీజేపీ నేత‌లు అంద‌రూ తెలుగుదేశం నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో ఎదో కబంద‌హ‌స్తాల నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్టు ఆనందంలో ఉన్నారు.. ఇక షా కూడా ఏపీ రాష్ట్ర క‌మ‌లం నాయ‌కుల‌కు పిలుపునిచ్చారు..  ఢిల్లీ రావాలంటూ పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న తెలియ‌చేశారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు పార్టీ రాష్ట్ర కోర్‌ కమిటీ నేతలతో ఆయన సమావేశమవుతారు..
 
రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు హరిబాబు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు తదితరులకు పిలుపు వచ్చింది... అయితే ఇటు వైసీపీ ప‌ద్ద‌తి ఇటు మిత్ర‌ప‌క్షం నుంచి వైదొలిగిన తెలుగుదేశం రాజ‌కీయ విధానం అలాగే అవిశ్వాస తీర్మానాల‌పై కూడా చ‌ర్చించ‌నున్నారు, ఏపీ బీజేపీ స‌రికొత్త వ్యూహాల‌తో ముందుకు వెళుతుంది అని తెలుస్తోంది..

షేర్ :

Comments

1 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.