అమిత్ షా ఫోన్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-27 14:39:26

అమిత్ షా ఫోన్ ?

జ‌గ‌న్, బీజేపీ క‌లుస్తాయా అనే ప్ర‌శ్న వైసీపీ నాయ‌కుల క‌న్నా తెలుగుదేశం నాయ‌కుల‌కు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.. అస‌లు పార్టీలు క‌లిస్తే ఆరెండింటికి ఉండాల్సిన ఉత్సాహం ఇటు తెలుగుదేశానికి మ‌రింత అమితంగా పెరిగిపోయింది.. జ‌గ‌న్ బీజేపీలో మంత‌నాలు జ‌రుపుతున్నారా..? లేక బీజేపీ జ‌గ‌న్ తో మంత‌నాలు జ‌రుపుతుందా అనే ఆలోచ‌న తెలుగుదేశానికి మ‌రింత పెరిగిపోయింది.
 
ఇక బీజేపీ నాయ‌కులు ఎలా మాట్లాడుతున్నా అంతా వైసీపీలో లాలూచీ అంటూ తెలుగుదేశం వెంట‌నే కౌంట‌ర్లు ఇస్తోంది... ఇక ఎన్డీయేతో బ‌య‌ట‌కు ఎందుకు వ‌చ్చారో వారికే తెలియ‌దు, అరుణ్ జైట్లీ రెండేళ్ల క్రితం ప్ర‌క‌టించిన ప్యాకేజీ మాటే ఇటీవ‌ల చెప్పారు... ఆ త‌ర్వాత చంద్ర‌బాబు ఎందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నారో త‌మ్ముళ్ల‌కే అర్ధం కావ‌డం లేదు.. 
 
ఇక ఇటీవ‌ల కేంద్రమంత్రి నిన్న చేసిన కామెంట్ల‌తో బీజేపీ వైసీపీ క‌లుస్తున్నాయి.... అని ఇక త‌మ ఆస్దాన మీడియాల‌లో కూడా ప్ర‌క‌ట‌న‌ల రేంజ్ లో చూపిస్తున్నారు... అయితే ప‌వ‌న్ ఈ ఎల్లో మీడియా ప‌రువు రోడ్డు మీద‌పెట్టేస‌రికి వారు కూడా కాస్త ప‌చ్చ పైత్యాన్ని త‌గ్గిస్తారు అనుకుంటే అదే స్పీడులో ఉన్నారు.
 
ఇక ఇప్ప‌డు మ‌రో వార్త హైలెట్ అవుతోంది.. ఏపీలో బీజేపీ ర‌థ‌సారధి అమిత్ షా వైసీపీ అధినేత జ‌గ‌న్ కు ఫోన్ చేశారు అని ఓ వార్త వైర‌ల్ అవుతోంది పొలిటిక‌ల్ కారిడార్లో.. అయితే ఆయ‌న ఫోన్ చేయ‌డానికి కార‌ణం..?  కన్నా లక్ష్మీనారాయణను వైసీపీలో చేర్చుకోవద్దని అమిత్ షా జ‌గ‌న్ కు తెలియ‌చేశారట‌. ఇదిగో అమిత్ జ‌గ‌న్ డీల్ అంటూ తెలుగుదేశం నాయ‌కులు దీనిని సునామీ  వార్త‌లా వైర‌ల్ చేస్తున్నారు.
                       
అయితే ఈ విష‌యాన్ని వైసీపీ నేత ఖండించారు.. ఇదంతా పుకారు అస‌లు లాజిక్ లేని ఆలోచ‌న అంటేనే కేరాఫ్ అడ్ర‌స్ తెలుగుదేశం అని అన్నారు.. అయితే క‌న్నాతో పాటు కాట‌సాని కూడా వైసీపీలో చేర‌డానికి రెడీ అవుతుంటే కేవ‌లం క‌న్నాను ఆయ‌న ఎందుకు ఆప‌మ‌ని మ‌మ్మ‌ల్ని కోరతారు ఇది లాజిక్ లేని ఆలోచ‌న, ఇలాంటివి తెలుగుదేశం ఎల్లో మీడియాల‌కు మాత్ర‌మే వ‌స్తాయి అని ఆ వైసీపీ సీనియ‌ర్ నేత దీనిని కొట్టిపారేశారు..
                           
మాకు ఏ బీజేపీ నేత ఫోన్ చేయ‌లేదు జ‌గ‌న్ తో మాట్లాడ‌లేద‌ని ఏ నాయ‌కులు మా పార్టీలో చేరినా ఆహ్వానిస్తామ‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.