అమిత్ షా ఎత్తుగడ..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-05 15:07:19

అమిత్ షా ఎత్తుగడ..?

బీజేపీ వ్యూహాలు వెయ్య‌డంలో అద్బుతమైన స్ట్రాట‌జీ ఫాలో అవుతుంది... త్రిముఖ పోరులో కూడా బీజేపీ మెజార్టీ సీట్ల‌ను సాధించుకోవ‌డంలో దిట్ట.... ఆనాటి అద్వాణీ, వాజ్ పేయ్ రాజ‌కీయాల‌కు ఇప్ప‌టి బీజేపీ రాజ‌కీయాల‌కు సంబంధం లేదు అంటారు సీనియ‌ర్లు..ద‌క్షిణాదిన కూడా త‌మ హావా చూపించాలి అని బీజేపీ త‌హ‌త‌హ‌లాడుతోంది.. ఇటు మైసూర్ ప్యాలేస్ నుంచి అటు అమ‌రావ‌తి క‌ర‌క‌ట్ట‌వ‌ర‌కూ అంతా త‌మ చేతుల్లోకి తెచ్చుకోవాలి అని అనుకుంటోంది కాషాయం పార్టీ.
 
అయితే నాటి ప‌దేళ్ల యూపీఏ పాల‌న‌లో వార‌స‌త్వ రాజ‌కీయపార్టీల‌కు ఓట్లు వేసి ప్ర‌జ‌లు గెలిపించింది, మ‌న‌కు ఎందుకు ఓటు వెయ్య‌రు అని భావించారు... అయితే యాడ్యుర‌ప్ప పై పాజిటీవ్ నెస్, కాంగ్రెస్ మైన‌స్ లు సిద్దా ఐదేళ్ల పాల‌న‌లో లొసుగులతో ప్ర‌చారం క‌న్న‌డ‌లో కొత్త పుంత‌లు తొక్కుతోంది బీజేపీ త‌ర‌పున‌.
 
ఇటు ఏపీలో కూడా బీజేపీ నాయ‌కులు క‌న్న‌డ‌లో ప్ర‌చారం చేస్తున్నారు... అలాగే తెలుగుదేశం నాయ‌కులు కూడా లోలోప‌ల ఒప్పందం చేసుకుని బీజేపీకి కాదు ఆ పార్టీకి ఓటు వెయ్యండి అని చెబుతున్నారు... అది కాంగ్రెస్ కావ‌చ్చు జేడీఎస్ కావ‌చ్చు, ఇప్ప‌టికే బీజేపీ కూడా దీనిపై త‌మ ప్లాన్ ప్ర‌కారం ముందుకు వెళుతోంది.
 
మాణిక్ సర్కార్ ని దెబ్బకొట్టినట్టే చంద్రబాబుపై కూడా రాజ‌కీయంగా ప్లాన్ వేస్తోంది బీజేపీ.. అవును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్రిపుర తరహా వ్యూహాన్ని అమలు చేసేంందుకు బీజేపీ  జాతీయాధ్యక్షుడు అమిత్ షా రంగం సిద్దం చేశారు.అయితే ద‌శాబ్దాలుగా ఒకే స‌ర్కారును చూసిన ప్ర‌జ‌లు కొత్త ప్ర‌భుత్వానికి రెడ్ కార్పెట్ ప‌రిచారు అని అన‌డం క‌న్నా ఇక్క‌డ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు, ఆ మేర‌కు కొత్త విధానాల అమ‌లు చేయ‌బోతున్నాం అని ప్ర‌చారంలో ముందుకు వెళ్లింది బీజేపీ.. అభివృద్ది జ‌రిగిన ప్రాంతాల‌ను ఐకాన్ గా చూపించింది బీజేపీ.
 
రామ్ మాధవ్ కు ఇక్క‌డ పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించి పార్టీని గాడిలో పెట్టాలి అని అనుకుంటున్నారు,ఏపీ  బీజేపీ అధ్యక్షుడిగా మాణిక్యాల‌రావు లేదా సోమువీర్రాజుకు అవ‌కాశం ఇచ్చి వీరికి వెనుక రామ్ మాధ‌వ్ తో  రాజ‌కీయంగా అడుగులు వెయ్యాలి అని బీజేపీ అనుకుంటోంది.. ఆర్ ఎస్ ఎస్ పాత్ర ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల్లో కీల‌కంగా ఉంటోంది.
 
త్రిపురలో బీజేపీ అత్యంత పకడ్బందీగా వ్యూహాన్ని అమలు చేసింది. ఇందులో ఆర్ఎస్ఎస్ పాత్ర చాలా పెద్దది. అనే చెప్పాలిఇప్పటికే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టి తమ పని తాము చేసుకుంటూ పోతున్నట్లు చెబుతున్నారు కొంద‌రు సీనియ‌ర్లు. ఆర్ ఎస్ ఎస్ అడుగుపెడితే ఇంటింటికి వెళ్లి బీజేపీ ప‌నులు బీజేపీ వ‌ల్ల దేశం ఎలా ముందుకు  వెళుతుంది అనేది తెలుపుతారు.... ఈ వ‌ర్గం వ‌స్తే బాబుకు అతి క‌ష్టం, ఇలా చేస్తే చంద్ర‌బాబు మాట‌ల తూటాలు త‌ప్పించి ఏమీ చేయ‌లేరు... ఏపీ బీజేపీ నేత‌ల‌కు వీరి సాయం ఉంటే బీజేపీకి ఇక్క‌డ తిరుగు ఉండ‌దు అని అనుకుంటున్నార‌ట అమిత్ షా.

షేర్ :

Comments

1 Comment

  1. Edichadu.vaadi aatalu end kocchayi.go back to pevillian.shaw ayyake bjp ki inta nastam jarugutu undi.criminals ni pakkana pedite bjp baaguntadi. Leda 2019 a last antey.

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.