చంద్ర‌బాబుకు షాక్ ఇవ్వ‌నున్న అమిత్ షా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-21 18:39:39

చంద్ర‌బాబుకు షాక్ ఇవ్వ‌నున్న అమిత్ షా

రాష్ట్రానికి  ప్ర‌త్యేక‌హోదా, విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాలను అమ‌లు చేయ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న తీరుకు నిర‌స‌న‌గా మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ కేంద్ర మంత్రి వ‌ర్గంలో నుంచి వైదొలిగిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయిన‌ప్ప‌టికి కేంద్రం త‌న తీరును మార్చ‌కోక‌పోగా త‌మ నాయ‌కుల‌తో విమ‌ర్శ‌లు చేయించింది బీజేపీ పార్టీ. ఇక‌ కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా రాష్ట్రంలో  ప్ర‌ధాన ప్ర‌తిపక్షమైన వైసీపీ అవిశ్వాసానికి తెర‌లేపింది. ఉత్కంఠ‌భ‌రిత‌మైన రాజ‌కీయ ప‌రిణామాల మ‌ధ్య టీడీపీ, ఎన్డీయే నుంచి వైదొలుగుతున్న‌ట్లు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.  
 
టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీని వీడ‌టానికి ప్ర‌ధాన అంశాల‌ను పేర్కోంటూ కేంద్రానికి లేఖ రాసిన విష‌యం అంద‌రికి తెలిసిందే. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం వల్ల 5 కోట్ల మంది ప్రజలు రోడ్డున పడ్డారని... ఆదుకోవాల్సిన కేంద్రం నిర్ల‌క్ష్యం వ‌హించింద‌ని పేర్కోన్నారు. హామీల అమలులో బీజేపీ చిత్తశుద్ధి చూపించలేక‌పోవ‌డం వ‌ల్లే ఎన్డీయే నుంచి వైదొలిగి అవిశ్వాసానికి సిద్దం అయిన‌ట్లు తెలిపారు చంద్ర‌బాబు. 
 
దీనికి స్పందించిన బీజేపీ, టీడీపీ చేసే ప్ర‌తి ఆరోప‌ణ‌కు స‌మాధానం ఇవ్వ‌డానికి ఒక లేఖ‌ను సిద్దం చేసింది. ఆ లేఖ‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రేపు విడుదల చేసే అవకాశం ఉంది. దీనిలో మిత్రధర్మాన్ని టీడీపీ ఎలా విస్మరించిందో... బీజేపీకి ఎలా ద్రోహం చేసిందో లాంటి అంశాల‌ను పేర్కోన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీకి చేసిన సహాయం, భవిష్యత్‌లో చేయబోయే సాయాన్ని ఆ లేఖలో వివరించనున్నారు. అలాగే ప్ర‌త్యేక‌హోదా అంశం పై సీఎం చంద్ర‌బాబు ఎలాంటి వైఖ‌రితో ఉన్నార‌నే విధానాన్ని ప్ర‌ధానంగా వివ‌రించ‌నున్నారు అమిత్ షా.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.