చంద్ర‌బాబుకు అమిత్ షా లేఖ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-24 17:48:09

చంద్ర‌బాబుకు అమిత్ షా లేఖ‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు కేంద్రానికి రాసిన లేఖ‌కు స‌మాధానం ఇచ్చారు బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా. టీడీపీ, ఎన్డీయే నుంచి బ‌య‌టికి రావ‌డం పై ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకున్నార‌ని అన్నారు అమిత్ షా ..ఈ నిర్ణ‌యం మాకు ఆశ్చ‌ర్యం క‌లిగించింద‌ని ఆయ‌న‌ తెలిపారు. ఏపీ అభివృద్దికి మోదీ పూర్తి స్థాయిలో స‌హ‌క‌రించార‌ని అమిత్ షా తెలిపారు. ఏపీకి సంబందించి ఏ విష‌యంలోను వెన‌క‌డుగు వేయ‌లేద‌ని అన్నారు. గ‌తంలో ఉభ‌య‌స‌భ‌ల్లో టీడీపీకి ప్రాధాన్య‌త లేన‌ప్పుడు.. బీజేపీనే అజెండా త‌యారు చేసింద‌ని ఆయ‌న‌ తెలిపారు.
 
ఏపీకి ఇచ్చిన హామీల‌ను కేంద్రం పూర్తి స్థాయిలో నేర‌వేర్చింద‌ని అన్నారు. టీడీపీ, ఏపీ ప్ర‌జ‌ల‌కు బీజేపీనే నిజ‌మైన స్నేహితుల‌ని  అమిత్ షా అన్నారు. 3 ఎయిర్‌పోర్ట్ ల‌ను అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాలుగా తీర్చిదిద్దిన‌ట్లు అమిత్ షా తెలిపారు. టీడీపీ అభివృద్ది కోసం కాదు రాజ‌కీయం కోస‌మే ఎన్డీయే నుంచి వెళ్లిపోయార‌ని అన్నారు. రాజ‌ధానికి 1000 కోట్లు ఇస్తే వాటిని కేవ‌లం 8 శాతం  మాత్ర‌మే వినియోగించుకున్నార‌ని....ఆ లెక్క‌లే తిరిగి కేంద్రానికి పంపించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.  
 
ఏపీకి ఇచ్చిన కేంద్ర విద్యా సంస్థ‌లు, ఎయిమ్స్ గురించి ఆయ‌న‌ ప్ర‌స్తావించారు.2016-2017 లో వెనుక‌బ‌డిన జిల్లాల అభివృద్దికి ఇచ్చిన నిధుల్లో కేవ‌లం 12 శాతం లెక్క‌లు మాత్ర‌మే కేంద్రానికి పంపిన‌ట్లు అమిత్ షా తెలిపారు.... అమ‌రావ‌తిలో రైలు రోడ్డు నిర్మాణానికి,180 కి . మి రింగ్ రోడ్డుకు నిధుల‌ను ప్ర‌స్తావిస్తూ, కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి నిధుల‌ను కేటాయించిన‌ట్లు అమిత్‌షా పెర్కోన్నారు. మెట్రో రైల్ సూత్ర‌ప్రాయంగా అంగీకారం తెలిపిన‌ట్లు ఆయ‌న‌ వెల్ల‌డించారు. పోల‌వ‌రానికి 500 కోట్లు కేటాయించామ‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.