అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-18 16:20:26

అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు

మొత్తానికి ఎన్డీయే నుంచి తెలుగుదేశం బ‌య‌ట‌కు రావ‌డంతో ఇటు బీజేపీ తెలుగుదేశం మ‌ధ్య రిలేష‌న్ చెడిపోయింది అని బ‌హిర్గ‌తం అయింది.. అయితే ఏపీకి మోసం జ‌రిగింది అని బీజేపీ మ‌న‌ల్ని మోసం చేసింది అని చంద్ర‌బాబు ఎన్డీయే నుంచి బ‌య‌టకు వ‌చ్చారు.. అయితే దీనిపై తాజాగా అమిత్ షా మాట్లాడారు.. ఏపీ సీఎం  చంద్ర‌బాబుకు మాకు ఎటువంటి విభేదాలు లేవ‌ని, ఆయ‌న కావాల‌నే ఎన్టీయే నుంచి బ‌య‌ట‌కు వెళ్లార‌ని, ఏపీకి ఎంత చెయ్యాలో అంత‌కంటే ఎక్కువ చేశామ‌ని ఆయ‌న తెలియ‌చేశారు.
 
ఇక తెలుగుదేశంతో అస‌లు పొత్తు వ‌ద్దు అని ఏపీ బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గం కోరుకుంద‌ని అది కూడా ఓ కార‌ణం అన్న‌ట్లు ఆయ‌న తెలియ‌చేశారు.. ఇక ఎన్డీయే నుంచి తెలుగుదేశం బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడి నియామ‌కం మ‌రింత అనివార్యం అయింది అని ఆయ‌న వెల్ల‌డించారు... ఇక ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు హ‌రిబాబు రాజీనామా వెనుక ఎటువంటి రాజ‌కీయాలు - ఒత్తిడులు లేవు అని ఆయ‌న తెలియ‌చేశారు.
 
ఇక త్వ‌ర‌లోనే ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు ఎవ‌రు అనేది తెలియ‌చేస్తామ‌ని క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో తాము కచ్చితంగా విజ‌యం సాధిస్తామ‌ని ఆయ‌న తెలియ‌చేశారు. ఇక లింగాయ‌త్ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు పెద్ద‌లు ప్ర‌ముఖులు ఎక్కువ శాతం బీజేపీ వెంట ఉన్నారు అని ఆయ‌న తెలియ‌చేశారు.
 
దేశంలో బీజేపీ మ‌రింత పుంజుకుంటోంది అని ఆయన పేర్కొన్నారు. ఇక ఏపీకి సంబంధించి కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన నాయ‌కుడ్ని బీజేపీ ర‌థ‌సార‌ధిగా నియ‌మించ‌నున్నారు అని తెలుస్తోంది. ఇక క‌ర్నాట‌క ఎన్నిక‌ల త‌ర్వాత కేంద్ర‌మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగ‌నుంది అని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.