అమ్మ..... టీడీపీ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-08 03:10:01

అమ్మ..... టీడీపీ ?

ఏదైనా మంచి జ‌రిగితే అది బాబుగారి క్రెడిట్, ఏదైనా నెగిటివ్ జ‌రిగితే ఐ డోంట్ నో అధికారుల అల‌స‌త్వం, ప్ర‌తిప‌క్షం నాట్ ఫోక‌స్ అంటారు బాబు... సేమ్ ఫార్మూలా ఫాలో అవుతారు తెలుగుదేశం నాయ‌కులు,అవును రాజు ఎటైతే అటేగా ప్ర‌జ‌లు పాల‌క‌ప‌క్ష స‌భ్యులు.
 
ఇక ఏపీ విడిపోవ‌డానికి కార‌ణం నేనే? ప్ర‌త్యేక రాష్ట్రం వ‌చ్చింది నావ‌ల్లే? నేను లేఖ‌రాశా? కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అని, తెలంగాణ‌లో చెబుతారు బాబు... అదే పాఠం ఏపీలో మార్చుతారు... కాంగ్రెస్ మోసం చేసింది ఏపీని అన్యాయంగా విడ‌గొట్టింది అని బీదార్పులు ఆర్చుతారు.. ఇది ఈ నాలుగు సంవ‌త్సరాల‌లో ప్ర‌జ‌లు అంద‌రూ గ‌మ‌నించారు.
 
ఇక ఆస్ధాన మీడియా బాబుకు ఎంత లెక్క‌న వంత‌పాడుతుంది అంటే, నేష‌న‌ల్ ఛాన‌ల్స్ కూడా మావ‌ల్ల కాదు అనేంత‌లా, ఏపీలో వ‌ర్షం వ‌చ్చినా బాబు వ‌ల్లే. ఏపీలో పంట పండినా బాబు వ‌ల్లే అంటారు... కాని వ‌ర‌ద‌లు వ‌స్తే ప్ర‌కృతి వ‌ల్ల అంటారు, కాదు జ‌గ‌న్ పూజ‌లు చేయించ‌డం వల్ల అంటారు.
 
ఇది కాస్త ప‌క్క‌న పెడితే జ‌గ‌న్ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని క‌లిసిన స‌మ‌యంలో, అమ్మ జ‌గ‌నా అంటూ ర‌చ్చ ర‌చ్చ చేసింది బాబు ఆస్ధాన మీడియా.... చివ‌ర‌కు కోర్టు మెట్లు ఎక్కేదాకా తెచ్చుకున్నారు.. ఒక‌రిని ఎంత కింద‌కి దిగ‌జార్చాలో వేస‌వి సెల‌వుల్లో క్లాసుల‌కు వెళ్లి మ‌రీ నేర్చుకున్నాడు ఆ ప‌త్రికాధినేత అని వైసీపీ ఎప్పుడూ విమ‌ర్శిస్తుంది. మ‌రి మాకు బ‌ద్ద శ‌త్రువులు అని కాంగ్రెస్ ను ఎప్పుడూ అంటారు బాబు.
 
అస‌లు కాంగ్రెస్ చేసిన ప‌నివల్లే, ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మ‌గౌర‌వం కోసం పార్టీ పెట్టారు, అవ‌న్ని బాబు ప‌క్క‌న పెట్టి తెలంగాణ సైకిల్ నాయ‌కుల‌ను  హ‌స్తం పార్టీలోకి పంపుతున్నారు అని ఇటు వైసీపీ విమ‌ర్శిస్తోంది.. ఏపీలో కాంగ్రెస్ గూటినుంచి  నాయ‌కుల‌ను త‌న పంచ‌న చేర్చుకున్నారు ఇప్పుడు తెలుగుదేశం ఎంపీలు కేశినేని నాని, తోట నర్సింహం, రామ్మోహన్‌నాయుడు కాంగ్రెస్ నాయ‌కురాలు సోనియాగాంధీని క‌లిశారు.. మ‌రి దీనిపై రేపు ఆస్ధాన‌మీడియా అమ్మ... టీడీపీ అని స్టోరి రాస్తుందా అని డిజిట‌ల్ సోష‌ల్ మీడియాలో చ‌ర్చించుకుంటున్నారు.
 
అలాగే మోదీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ వెంట బాబు న‌డిచినా ఆశ్చ‌ర్య‌పోవ‌క్క‌ర్లేదు అంటున్నారు... చూడాలి ఏపీలో చిన‌బాబు కేంద్రంలో  రాహుల్ బాబు ఏమి అంటారో ఈ విష‌యంలో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.