వైసీపీలోకి ఆనం బ్ర‌ద‌ర్స్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-14 15:20:30

వైసీపీలోకి ఆనం బ్ర‌ద‌ర్స్ ?

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌డానికి ముందు అయిష్టత చూపించారు ఆనం బ్ర‌ద‌ర్స్... కాంగ్రెస్ పార్టీ ప‌రిస్దితి దారుణంగా ఏపీలో ఉండ‌టంతో వెంట‌నే అధికార పార్టీ తెలుగుదేశంలో చేరారు... పార్టీలో చేరిన ఆనం బ్ర‌ద‌ర్స్ కు ఎటువంటి ప్ర‌యారీటి పార్టీ ఇవ్వ‌లేదు, అలాగే పార్టీలో ఉన్న నాయ‌కులు కూడా, జిల్లాలో జ‌రిగే కార్య‌క్ర‌మాల‌కు  ఆనం బ్ర‌ద‌ర్స్ ను  పిల‌వలేదు.. ఇక రెండు టర్మ్ లు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఆనం బ్ర‌ద‌ర్స్ కు ప‌ద‌వి వ‌స్తుంది అని ఊహించారు ఆయ‌న కేడ‌ర్...అయితే అటువంటిది జ‌రుగ‌లేదు, అమ‌రావ‌తి వెళ్లి క‌లిసినా వారి సోద‌రుల్లో ఎవ‌రికి ప‌ద‌వి వ‌రించ‌లేదు.
 
దీంతో నెల్లూరు జిల్లాలో బ‌ల‌మైన నాయ‌క‌త్వం కేడ‌ర్ ఉన్న ఆనం సోద‌రులు త‌మ ప్లాన్ మార్చుకోవాలి అని చూస్తున్నార‌ట... ఇప్ప‌టికే ఆరోగ్యం క్షీణించ‌డంతో ఆనం వివేకా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు... అయితే జిల్లాలో తెలుగుదేశం నాయ‌కులు ప్రేమ చూపిస్తున్నా వెనుక ఉండి ఆనం ఫ్యామిలీకి గోతులు త‌వ్వుతున్నారు అని అంటున్నారు వారి కేడ‌ర్.
 
ముఖ్యంగా ఆనం సోద‌రులు జిల్లాలో ఎమ్మెల్సీ అయితే క‌చ్చితంగా మంత్రులుగా ఉన్న‌వారి ఆట‌లు సాగ‌వు, దీంతో ఇప్ప‌టి వ‌ర‌కూ కొంద‌రు నాయ‌క‌లు  బాబు ద్వారా వారికి ఎమ్మెల్సీ ఇవ్వ‌కుండా అడ్డుకున్నార‌ట... అలాగే మంత్రి ప‌ద‌వి కూడా రాకుండా చేశారు... ఇక ఇప్పుడు టిక్కెట్ వ‌స్తే మళ్లీ ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి హావా జిల్లాలో కొన‌సాగుతుంది. గ‌తంలో వారు కాంగ్రెస్ లో ఉన్న స‌మ‌యంలో టీడీపీ పై అణిచివేత ధోర‌ణి ఎందుకు మ‌ర్చిపోతాం... అందుకే వారికి ఇప్పుడు సీటు కూడా ఇచ్చే ఆలోచ‌న‌లు చేయ‌డం లేదట... అయితే ఇది గ‌మ‌నించిన ఆనం త‌న బ్ర‌ద‌ర్ తో అలాగే వార‌సుల‌తో చ‌ర్చించి త్వ‌ర‌లో వైసీపీలో చేరాలి అని అనుకుంటున్నారు అని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.