వైసీపీ లోకి ఆనం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-19 16:20:06

వైసీపీ లోకి ఆనం

2019 సార్వత్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ప‌డుతున్న నేప‌థ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులలో వ‌ర్గ విభేదాలు ఎక్కువ అవుతున్నాయి. ప్ర‌తీ సెగ్మెంట్ కు టీడీపీ త‌ర‌పున ఇద్ద‌రు టీడీపీ ఇంచార్జ్ లు ఉండ‌డంతో టీడీపీలో వ‌ర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. అయితే ఈ వ‌రుస‌లో రాయ‌ల‌సీమ ముందంజలో ఉంది. ఇటీవ‌లే మంత్రి అఖిల ప్రియ తెలుగు దేశం పార్టీ నాయ‌కుడు ఏవీ సుబ్బారెడ్డి మ‌ధ్య గొడ‌వ తారా స్థాయికి చేరుకుని చివ‌ర‌కు ఈ పంచాయితీ ముఖ్య‌మంత్రి దృష్టికి చేరిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక ఇదే క్ర‌మంలో ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు పార్టీ నిర్ణ‌యం మేర‌కు ప‌త్తికొండ నియోజ‌కవ‌ర్గం ప‌రిధిలో మినీ మ‌హానాడు స‌భ‌ను ఏర్పాటు చేశారు. ఈ సభ‌కు ఎమ్మెల్సీ కేఈ ప్ర‌భార్, అలాగే శాలివాహ‌న కార్పొట‌ర్ తుగ్గ‌లి నాగేంద్ర మ‌ధ్య గొడ‌వ తారా స్థాయికి  చేరుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక దీంతో పాటు ఆలూరు నియోజ‌కవ‌ర్గంలో కూడా టీడీపీ నాయ‌కులు మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్రమంలో మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు..నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్‌ వైకుంఠం మల్లికార్జున చౌదరిని ఉద్దేశించి ఆలూరులో టీడీపీ రెండో కార్యాలయం ప్రారంభించడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాలు రచ్చకెక్కాయి.
 
ఇక తాజాగా నెల్లూరులో కూడా మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి  మాజీ మంత్రి ఆనం రామ‌నారాయణ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆనం మాట్లాడుతూ త‌మ 35  సంవ‌త్స‌ప‌రాల రాజ‌కీయ జీవితంలో ఏనాడు ఇన్ని అవమానాలు పడలేదని ఆయ‌న ఆగ్ర‌హం చెందారు. 
 
అయితే దీనికి కార‌ణం టీడీపీ నేతలే అని మండిప‌డ్డారు. నెల్లూరు జిల్లాలో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఉన్నా కానీ రైతుల స‌మ‌స్య‌లు అలాగే ఉన్నాయ‌ని అన్నారు. ఇక వారు ఇలాగే కొంత కాలం పాటు కొన‌సాగితే రైతులు  తిరుగుబాటు చేసే పరిస్థితి దగ్గర్లో ఉందని ఆనం తెలిపారు. అధికార పార్టీ ఇంచార్జిగా ఉన్నా చార్జింగ్ మాత్రం లేదని అన్నారు. నేను కేవలం జెండా పట్టుకోవడానికే సరిపోతానా, ప్రజల సమస్యలు తీర్చడానికి నేను పనికిరానా అని మండిప‌డ్డారు. ఇదే అంశంపై రాజ‌కీయ విశ్లేష‌కులు చ‌ర్చించుకుంటున్నారు. టీడీపీ లో ఉంటూ టీడీపీ నాయ‌కుల‌ను తీవ్ర స్థాయిలో విమ‌ర్శించ‌డం ఏంటి అని చ‌ర్చిస్తున్నారు. ఇక ఆనం స‌భ‌లో మాట్లాడిన తీరును బట్టి చూస్తుంటే క‌చ్చితంగా టీడీపీకి గుడ్ బై చెప్పేప‌నిలో ఉన్నార‌ని భావిస్తున్నారు.
 
అయితే గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటార‌నే వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ వార్త త్వ‌ర‌లో నిజం కాబోతుంద‌ని తాజాగా జిల్లా వాసులు కూడా చ‌ర్చించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఆనం, ఆయ‌న అనుచ‌రుల‌తో స‌హా తెలుగు దేశం పార్టీకి దూరంగా ఉంటూ వ‌చ్చారు.
 
ఇక ఆనం బాట‌లోనే మ‌రో సీనియ‌ర్ తెలుగుదేశం నేత ఆదాల ప్రభాకరరెడ్డి కూడా వైసీపీలో చేర‌నున్నారు అని స‌రికొత్త వార్త‌లు వినిపిస్తున్నాయి.. ఇక ఆయ‌న్ని పార్టీ మార‌కూడ‌దు అని జిల్లా నాయ‌కులు మంత‌నాలు జ‌రుపుతున్నార‌ట‌. కానీ వారి మంత‌నాల‌ను ఏమాత్రం ప్ర‌భాక‌ర్ లెక్క‌చేయ‌ట్లేదు అని తెలుస్తోంది. ఇక వీరిద్ద‌రు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరితే నెల్లూరులో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావ‌ని అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.