వైజాగ్ ను ఎంచుకున్న ఆనం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-07 15:38:51

వైజాగ్ ను ఎంచుకున్న ఆనం

ఆనం ఫ్యామిలీ రాజకీయ అరంగేట్రం చేసిన‌ప్ప‌టి నుంచి సుదీర్ఘ రాజకీయ ప్ర‌యాణంలో టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ నుంచి మ‌ళ్లీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి అడుగువేసిన ఆనం ఫ్యామిలీ అన‌తి కాలంలోనే సైకిల్ దిగి ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ద‌మ‌య్యారు. 2014 నుంచి టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అసంతృప్తితో ఉన్న నాయ‌కుల‌లో ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి ఒక‌రు. నెల్లూరు టీడీపీ రాజ‌కీయ నాయ‌కులు హైలెట్ అవ్వ‌డానికి త‌మంటే తాము గ్రేట్ అని నిరూపించుకునేందుకు ఒకరిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు.
 
దీంతో ఆనం ఒక అడుగు ముందుకు వేసి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌వేశ పెట్టిన మినీ మ‌హానాడులో సభా ముఖంగా ఆనం త‌న మ‌న‌సులో ఉన్న మాట‌ను బ‌య‌టపెట్టారు. ఇక అప్ప‌టినుంచి పార్టీకి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. అయితే ఈ మ‌ధ్య‌కాలంలో ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హైద‌రాబాద్ కు ప‌ర్య‌టించిన నేప‌థ్యంలో ఆయ‌న త‌న రాజ‌కీయంపై చ‌ర్చించారు. ఈ చ‌ర్చ అనంత‌రం ఆయ‌న వైసీపీలో చేరేందుకు సిద్ద‌మయ్యార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆనం అఫీషీయ‌ల్ గా ప్ర‌క‌టించ‌లేదు.
 
అయితే విస్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారంప్ర‌కారం జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా వైజాగ్ చేరుకున్న త‌ర్వాత ఆర్కే బీచ్  లో నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న వైసీపీ కండువా క‌ప్పుకోనున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దానికోసం ఈనెల 13న ముహూర్తం నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. అయితే అప్ప‌టిలోగా వైజాగ్ వ‌ర‌కూ పాద‌యాత్ర వెళ్ల‌క‌పోతే ఆ జిల్లాలో ఎక్క‌డ స‌భ జ‌రిగితే అక్క‌డ ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి పార్టీలో చేరుతార‌ని ప్ర‌చారం సాగుతోంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.