ఆనం ఫిక్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-13 12:04:25

ఆనం ఫిక్స్

ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి ఇక తెలుగుదేశానికి రాజీనామాచేసే యోచ‌న‌లో ఉన్నారు అని తెలుస్తోంది.. ఆయ‌న పార్టీ మారి వెంట‌నే వైసీపీ కండువా క‌ప్పుకోవడానికి రెడీ అవుతున్నారు అని అంటున్నారు ఆనం కేడ‌ర్.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఆయ‌న‌కంటూ ప్ర‌త్యేకంగా గుర్తింపు లేక‌పోవ‌డం, ఇస్తాను అన్న సీట్ల హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌డంతో, పాటు ఎమ్మెల్సీ సీటు ఇవ్వ‌క‌పోవ‌డం, సోద‌రుడిని పొగొట్టుకోవ‌డం తెలుగుదేశంలో ఇమ‌డ‌లేని స్దితిలో ఉన్నారు ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి అంటున్నారు జిల్లా నాయ‌కులు.
 
ఇక నెల్లూరు జిల్లాలో వైసీపీలో ఉన్న కీల‌క నాయ‌కుల్లో చాలా మంది కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన వారే...ముఖ్యంగా ఆనం సోద‌రులు వైసీపీలో చేరాలి అని ముందుగా అనుకున్నా, చివ‌రి నిమిషంలో అధికార పార్టీలో హామీల‌తో చేరారు.. ఇక ఆయన కొద్ది కాలంగా తెలుగుదేశం పార్టీలో అంటి ముట్ట‌న‌ట్టు ఉంటున్నారు.. ఇక ఈ సమ‌యంలో వైసీపీలో చేర‌క‌పోయినా తెలుగుదేశంలో కొన‌సాగితే వ‌చ్చే ఎన్నికల్లో రాజ‌కీయంగా త‌మ ఉనికికే ప్ర‌మాదం అని భావించారు ఆనం ఫ్యామిలీ.
 
ముఖ్యంగా ఆనం త‌న‌యులు కూడా రాజ‌కీయంగా అరంగేట్రం చేయాల‌ని చూస్తున్నారు..ఈ స‌మ‌యంలో వైసీపీ త‌ర‌పున పార్టీలో స‌ముచిత స్ధానం ఇస్తే వెంట‌నే చేరేందుకు మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి రెడీ అయ్యారు అని తెలుస్తోంది.. ఆయ‌న జ‌గ‌న్ పాద‌యాత్ర‌లోనే వైసీపీలో చేరే అవకాశం ఉంది అని అంటున్నారు జిల్లా కేడ‌ర్‌... తూర్పుగోదావ‌రి జిల్లా పాద‌యాత్ర‌లోనే జ‌గ‌న్ స‌మ‌క్షంలో ఆయన వైసీపీ తీర్దం పుచ్చుకుంటార‌ని అంటున్నారు జిల్లా వైసీపీ శ్రేణులు మ‌రి ఆ సెగ్మెంట్ల ఏమిటో తెలియాలి... దీంతో తెలుగుదేశం డైల‌మాలో ప‌డింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.