సెప్టెంబ‌ర్ మెద‌టి వారం ఏపీలో పెను సంచ‌ల‌నం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-24 17:56:10

సెప్టెంబ‌ర్ మెద‌టి వారం ఏపీలో పెను సంచ‌ల‌నం

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో నెల్లూరు జిల్లాలో రాజ‌కీయాలు ర‌సవ‌త్త‌రంగా మూరుతున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీలో కీల‌క నాయ‌కులుగా ఉన్న రాజ‌కీయ‌ నాయ‌కులు కూడా ఉన్నప‌ళంగా టీడీపీకి గుడ్ బై చెప్పి ప్ర‌తిక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. అయితే ఇదే క్ర‌మంలో టీడీపీ నాయ‌కులు ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి ముందంజ‌లో ఉన్నారు.  
 
ఆయ‌న 2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టినుంచి అధిష్టానంపై గుర్రున ఉంటున్నారు. ఇక ఈ మ‌ధ్య‌కాలంలో త‌న సోద‌రుడు మ‌ర‌ణించ‌డంతో టీడీపీ పై వ్య‌తిరేక‌త మ‌రింత పెరిగింది. ఇక పోయినంత కాలం టీడీపీలో ఇలానే కొన‌సాగితే త‌నకు రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని గ్ర‌హించి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరాల‌నుకున్నారు. 
 
అయితే ఈ మేర‌కు జ‌గన్ మోహ‌న్ రెడ్డి  హైద‌రాబాద్ చేరుకున్న‌ప్పుడు రెండు సార్లు క‌లిశారు. ఇక ఎన్నిక‌లు దగ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఆనం త‌న అనుచ‌రుల‌తో స‌మావేశం అయి వారి సూచ‌న‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. తన అనుచ‌రుల సూచ‌న‌ల మేర‌కు ఆనం సెప్టెంబ‌ర్ 2వ తేదిన విశాఖ ప‌ట్నంలో అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకుని చేర‌నున్నార‌ని ప్ర‌క‌టించారు. 
 
ఇక సెప్టెంబర్‌ మొదటి వారంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన రెడ్డి తనయుడు రాంకుమార్‌రెడ్డి కూడా వైసీపీలో చేరనున్నా రు. ఈ విషయాన్ని ఆయన ఇది వరకే ప్రకటించారు. ఈయన కూడా పార్టీలో చేరేందుకు విశాఖపట్నంనే వేదికగా ఎంచుకున్నారు

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.