ఆనం వైసీపీ లో చేరిక‌కు అదే అడ్డు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-23 14:49:28

ఆనం వైసీపీ లో చేరిక‌కు అదే అడ్డు

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో రాజ‌కీయ సీనియ‌ర్ నాయ‌కులు, అలాగే జూనియ‌ర్ మోస్ట్ సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. అయితే ఇందులో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారుతోంది. ఎందుకంటే గతంలో ఎన్న‌డూలేని విధంగా టీడీపీ నాయ‌కులు ఉన్నప‌ళంగా ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేస్తున్నారు. 
 
అయితే ఇప్ప‌టికే రాయ‌ల‌సీమ‌లో రాజ‌కీయాల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి అనుచ‌రుడు, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్ఙం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఆయ‌న‌తోపాటు టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు య‌ల‌మంచిల ర‌వి, వ‌సంత‌కృష్ణ ప్ర‌సాద్ వైసీపీ తీర్థం తీసుకున్నారు.
 
అయితే ఇదే క్ర‌మంలో నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయ‌కులు ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి కూడా వైసీపీ తీర్థం తీసుకోనున్నారు. దివంగ‌త రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో రాజ‌కీయంగా ఓ వెలుగు వెలిగిన ఆనం ఫ్యామిలీ తెలుగు రాష్ట్రాల విభజ‌న జ‌రిగిన త‌ర్వాత టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు.
 
అయితే మ‌ధ్య కాలంలో త‌న సోద‌రుడు అనారోగ్యంతో మ‌ర‌ణించిన‌ప్ప‌టి నుంచి రామ‌నారాయ‌ణ రెడ్డి టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. అంతేకాదు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో రాష్ట్ర వ్యాప్తంగా మినీమ‌హానాడుకు పిలుపునిచ్చారు. ఇక ఈ స‌భ‌ను వేదిక‌గా చేసుకుని టీడీపీ నాయ‌కులు ఆనం త‌న మ‌న‌సులో ఉన్న భాద‌ను ప్ర‌జ‌లకు వివ‌రించి తాను టీడీపీ పార్టీలో ఇమ‌డ‌లేక పోతున్నాని, చాలా కాలంగా జిల్లా పార్టీ నాయ‌కులు చిన్న చూపుతో చూస్తున్నార‌ని అందుకే తాను పార్టీ వీడాల‌నుకుంటున్నాన‌ని చెప్పి... చెప్పిన విధంగా టీడీపీకి గుడ్ బై చెప్పారు. కానీ ఏ పార్టీలోకి వెళ్తాన‌ని మాత్రం చెప్ప‌లేదు.
 
అయితే ఆ మ‌ధ్య‌కాలంలో వ‌రుస‌గా రెండు సార్లు ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని హైద‌రాబాద్ లో క‌లిసి త‌న రాజకీయ భ‌విష్య‌త్ గురించి జ‌గ‌న్ కు వివ‌రించటంతో ఆయ‌న దాద‌పు వైసీపీలో చేర‌డం ఖాయం అయిన‌ట్లే. అయితే ముందుగా ఆనం రామనారాయణ రెడ్డి తనకు ఆత్మకూరు సీటు కావాలని ఒత్తిడి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ సీటులో ఇప్పడు వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు సో.. అక్క‌డ ఆనంకు సీటు ఇవ్వ‌డం కుద‌ర‌దు, ఇక మిగిలింది వెంక‌ట‌గిరి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ సీటు ఇస్తాన‌ని చెప్పార‌ట‌.
 
ఈ నియోజ‌క‌వ‌ర్గంలో స‌రైన అభ్య‌ర్థి అవ‌స‌రం ఎందుకంటే 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ పార్టీ స్వ‌ల్ప మెజార్టీతో ఓడిపోయింది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాగైనా ప‌ట్టు సాధించాల‌నే ఉద్దేశ్యంతో జ‌గ‌న్ ఆనంకు ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆనం ఫ్యామిలీ అంటే నియోజ‌క‌వ‌ర్గానికే కాదు జిల్లా వ్యాప్తంగా మంచి పేరు ఉంది సో ఇక్క‌డ ఆనం అయితే క‌రెక్ట్ అని భావించి జ‌గ‌న్, ఆయ‌న‌ను సెల‌క్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఆనం కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక డీల్ ఓకే అవ్వ‌డంతో ఆనం ఆషాడమాసం అయిపోగానే వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.