రెండు రోజుల్లో వైసీపీలోకి ఆనం ఫ్యామిలీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-04 16:27:31

రెండు రోజుల్లో వైసీపీలోకి ఆనం ఫ్యామిలీ

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్వేలను నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌ర్వే ప్ర‌కారం ప్ర‌జ‌లు టీడీపీ ప్ర‌భుత్వంపై అసంతృప్తితో ఉన్నార‌ని, క‌చ్చితంగా వారు త‌మ ఓటుతో టీడీపీ నాయ‌కులకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో బుద్ది చెప్పేందుకు రెడీ అయ్యార‌ని తెలిపింది. ఇక ఈ  విష‌యం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని పాద‌యాత్ర చేస్తున్న‌ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడీ అయ్యార‌ట‌.
 
అయితే ఇప్ప‌టికే టీడీపీలో సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులంతా వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇదే క్ర‌మంలో ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి కూడా మ‌రో రెండు రోజుల్లో టీడీపీకి రాజీనామా చేసి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడీ అయ్యాట‌.గ‌తంలో కాంగ్రెస్ త‌ర‌పున ఆనం సోద‌రులు నెల్లూరు జిల్లాలో చ‌క్రం తిప్పారు. ఆ త‌ర్వాత తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న జ‌రిగింది. విభ‌జ‌న త‌ర్వాత‌ 2014లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో ఆనం సోద‌రులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు.
 
ఆ త‌ర్వాత నుంచి టీడీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఇక ఈ మ‌ధ్య‌కాలంలో ఆయ‌న సోద‌రుడు ఆనం వివేకానంద‌రెడ్డి అకాల మ‌ర‌ణంతో కుంగిపోయిన రామ‌నారాయ‌ణ రెడ్డి త‌న భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ గురించి జిల్లా వ్యాప్తంగా చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఇక ఈ చ‌ర్చ‌ల నేప‌థ్యంలో టీడీపీకి రాజీనామా చేసి త్వ‌ర‌లో వైసీపీ లో చేరుతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు బుజ్జ‌గింపు కార్య‌క్ర‌మాలు చేసినా అనం ఫ్యామిలీ మాత్రం టీడీపీలో తాము ఉండ‌మ‌ని తెగేసి చెబుతుతోంది. దీంతో ఫ్యామిలీ నిర్ణ‌యం మేర‌కు అలాగే కార్య‌క‌ర్త‌ల సూచ‌న‌ల మేర‌కు ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి  రెండు రోజుల్లో వైసీపీలో చేరుతార‌ని వార్తలు వ‌స్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.