ఆయ‌న వైసీపీలో చేరిక‌తో పార్టీకి మ‌రింత బ‌లం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-09-03 11:55:54

ఆయ‌న వైసీపీలో చేరిక‌తో పార్టీకి మ‌రింత బ‌లం

2019 సార్వత్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో రాజ‌కీయ పార్టీ నాయ‌కులు త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని ఇత‌ర పార్టీ లో చేరుతున్నారు. అయితే ఇదే క్ర‌మంలో 2019లో ఖ‌చ్చితంగా వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని భావించి ఆయా పార్టీల‌కు చెందిన నాయ‌కులు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇదే క్ర‌మంలో నెల్లూరు జిల్లా టీడీపీ సీనియ‌ర్ నేత ఆనం రామ‌నారాయ‌ణ‌ రెడ్డి, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. 
 
కొద్దికాలంగా అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌పై అసంతృప్తితో ఉన్న ఆనం చాలా కాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. అయితే ఈ మ‌ధ్య‌కాలంలో ఆయ‌న వైసీపీ తీర్థం తీసుకుంటార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇక ఈ వార్త‌లకు అనుకూలంగా ఆయ‌న నిన్న విశాఖ‌పట్నంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు. ఇక ఆయ‌నతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్య‌మంత్రి కుమారుడు రాంకుమార్ కుడా మ‌రో వారంలో వైసీపీ తీర్థం తీసుకోనున్నారు.
 
ఇక ఆయ‌న కూడా వైసీపీ తీర్థం తీసుకుంటే నెల్లూరు జిల్లాలో వైసీపీకి తిరుగులేద‌ని అంటున్నారు. గ‌తంలో వీరిద్ద‌రు రాజ‌కీయ ల‌బ్ధి కోసం కాకుండా ప్ర‌జా సేవ చేసి జిల్లా వ్యాప్తంగా ప్ర‌జ‌ల మ‌న్న‌న‌ల‌ను పొందారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.