2వ తేది వైసీపీలో చేరుతున్న

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

anam rama narayana reddy
Updated:  2018-08-28 15:18:05

2వ తేది వైసీపీలో చేరుతున్న

అధికార‌ తెలుగుదేశం పార్టీకి చెందిన ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి తాను సెప్టెంబ‌ర్ 2వ తేదిన పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీలో చేరుతున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. అంతేకాదు ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు. 
 
ఆ త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీలో  సిద్దాంతాలు లేవ‌ని ఆయ‌న తెలిపారు. తాను ఇలానే టీడీపీలో కొన‌సాగితే రాజ‌కీయ మ‌నుగ‌డ కొన‌సాగించ‌లేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అంతేకాదు త‌మ కుటుంబం గత ప‌దేళ్లుగా సెప్టెంబర్ 2వ తేది గుర్తుచేసుకున్న రోజు.. బాధ‌ప‌డిన రోజు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణ వార్త అని ఆయ‌న మ‌రోసారి గుర్తు చేశారు.
 
2019లో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఖ‌చ్చితంగా ముఖ్య‌మంత్రి అవ్వ‌డం ఖాయం అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ప్ర‌జ‌లంద‌రి ముఖంలో చిరున‌వ్వు క‌నిపిస్తుంద‌ని ఆనం తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.