వైసీపీలోకి ఆనం ఫ్యామిలీ డేట్ ఫిక్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-07 18:49:19

వైసీపీలోకి ఆనం ఫ్యామిలీ డేట్ ఫిక్స్

ప్ర‌తిప‌క్ష‌నేత వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019 లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ఎండ‌, వాన‌, గాలి అని తేడాలేకుండా ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జా సంకల్ప‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంక‌ల్పయాత్ర‌లో జ‌న‌నేత జ‌గ‌న్ కు అడుగ‌డుగా ప్ర‌జ‌లు ప‌డుతున్న బ్ర‌హ్మ‌ర‌థాన్నిచూసి అధికార టీడీపీ నాయ‌కులు బెంబేలెత్తి పోతున్నారు అంటే అతిశ‌యోక్తి లేదు.
 
ఇక మ‌రికొంద‌రు టీడీపీ నాయ‌కులయితే ముంద‌స్తు రాజ‌కీయ‌ జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటున్నారు. అయితే ఇప్ప‌టికే టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కులుగా ఉన్న య‌ల‌మంచిలి ర‌వి, వ‌సంత కృష్ణ ప్రసాద్ ఫ్యామిలీలు కూడా వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన‌ ఆనం ఫ్యామిలీ కూడా వైసీపీ తీర్థం తీసుకోనుంది. గతంలో కూడా అనం రామ‌నారాయ‌ణ రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరుతార‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కానీ ఈ విష‌యంపై ఆయ‌న ఎలాంటి స్ప‌ష్టం ఇవ్వ‌లేదు. అంతేకాదు రామనారాయ‌ణ రెడ్డి త‌న సోద‌రుడు మ‌ర‌ణం త‌ర్వాత నుంచి తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో ఉన్నా కూడా అధిష్టానం ఆయ‌న‌ను కొంచెం కూడా కేర్ చేయ‌లేదు. 
 
దీంతో ఆనం త‌న‌కు పార్టీ ఇవ్వ‌లేద‌నే ఉద్దేశ్యంతో ఆనం పార్టీకి దూరంగా ఉంటూ వ‌చ్చారు. ఇక ఇదే విష‌యాన్ని త‌న ఫ్యామిలీతో అలాగే అనుచ‌రుల‌తో చ‌ర్చించారు గ‌తంలో ఇక వారి కోరిక మేర‌కు ఆనం టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న ఏ పార్టీలో చేరుతార‌న్న‌ది మాత్రం చెప్ప‌లేదు. 
 
ఇక తాజాగా  సీబీఐ విచార‌ణ నిమిత్తం నిన్న వైఎస్ జ‌గ‌న్ హైద‌రాబాబ్  విమానాశ్ర‌యానికి చేరుకోగానే అక్క‌డ ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, జ‌గ‌న్ ను క‌లిసి సుమారు 15 నిమిషాల‌పాటు మాట్లాడుకున్నారు. వారిద్ద‌రు మాట్లాడుకోవ‌డాన్ని చూస్తుంటే వారం లేక పది రోజుల్లో ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి తూర్పుగోదావరిలో పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడి అయ్యార‌ని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.