ఇప్ప‌టికీ ఆకోరిక తీర‌లేద‌ట‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-26 16:31:46

ఇప్ప‌టికీ ఆకోరిక తీర‌లేద‌ట‌

నెల్లూరు జిల్లా ప్ర‌జ‌ల‌నే కాదు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను కూడా ఆనం మ‌రణం విషాదంలో నింపింది...వివేకా మరణం ఆనం కుటుంబానికి వ్యక్తిగతంగా, రాజకీయంగా తీరని నష్టం తెచ్చిందనడంలో సందేహం లేదు... ఎన్నిక‌ల్లో ఆనం ప్ర‌చారానికి వెళితే చాలు వంద‌లాది మంది ఆయ‌న చుట్టూ చేరేవారు ఇప్పుడు ఆనం న‌వ్వులు ఆనందాలు చిలిపి మాట‌లు వినిపించ‌వు.
 
ఆనం కుటుంబానికి రాజకీయ పునర్జన్మ ఇచ్చిన వ్యక్తి వివేకానందరెడ్డి. ఆయన తన కంటే కుటుంబానికే ఎక్కువ విలువ ఇచ్చారు..... రాజకీయ రంగ ప్రవేశం చేసిన 1976 నుంచి 2014 వరకూ  కుటుంబ సభ్యుల ఎదుగుదలకు కృషి చేశారు. 1976 తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి తన అన్న కుమా రుడు భక్తవత్సల రెడ్డి పోటీ చేశారు.
 
ఆ నియోజకవర్గంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఉండేవి. అదే స్థానానికి ఎస్వీయూ విద్యార్థి నాయకుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నామి నేషన్‌ వేయడానికి నెల్లూరుకు వచ్చారు. వివేకా చంద్రబాబును ఒప్పించి నామినేషన్‌ వేయకుండా చేశారు... 1978లో జనతా పార్టీ తరపున ఒంగోలు ఎంపీగా ఆనం భక్తవత్సల రెడ్డి, నెల్లూరు అసెంబ్లీకి తండ్రి వెంకట రెడ్డిని బరిలోకి దింపి వీరి గెలుపు కోసం ఆ రెండు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.
 
అయితే, పై మూడు ఎన్నికల్లో ఆనం కుటుంబానికి పరాజయమే ఎదురయ్యింది. అయినా వారు వెనుతిరిగి చూడ‌లేదు..1983 లో టీడీపీలో చేరి తన తండ్రి వెంకటరెడ్డికి ఆత్మకూరు, తమ్ముడు రామనారాయణరెడ్డికి నెల్లూరు టిక్కెట్లు ఇప్పించుకుని గెలిపించుకున్నారు. వీఆర్‌ కాలేజీ కరెస్పాండెంట్‌గా అన్న కుమారుడు భక్తవత్సల రెడ్డిని గెలిపించుకున్నారు.
 
రాజకీయాల్లో వివేకా చంద్రబాబు, వైఎస్‌ఆర్‌ సమకాలికుడు. 1976లో ఈయన నెల్లూరు యూత్‌ కాంగ్రెస్‌ కార్యదర్శిగా ఉండగా అదే సమయంలో చిత్తూరు, కడప యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నారు. ఆనాటి నుంచి ఆ ఇద్దరు నాయకులతో వివేకాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినా తన పరిచయాలను తన తమ్ముని కోసం వాడుకున్నారు తప్ప తన కోసం ఉపయోగించుకోలేదు ఆనం వివేకానంద‌రెడ్డి... త‌న‌కు ప‌ద‌వులు అంటే అంత వ్యామోహం లేదు అని ముందు నుంచి త‌న స‌న్నిహితుల‌తో చెప్పేవారు.
 
ఇక  1999 నుంచి 2009  వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినా మంత్రి పదవిని ఆశించలేదు. తన తమ్ముడు రామనారాయణ రెడ్డికే ఆ పదవులు సిఫార్సు చేశారు. తాను నెల్లూరు రాజకీయాలకే పరిమితమయ్యారు. కాంగ్రెస్‌ పతనంతో ఆనం కుటుంబ ప్రాబల్యం తగ్గు ముఖం పట్టింది. నిలదొక్కుకోవడం కోసం టీడీపీలో చేరారు. అన్నదమ్ముల్లో రాజకీయ విభేదాలు పొడచూపాయి. బిడ్డలకు రాజకీయంగా దారి చూపాలని పడిన తపన ఫలించలేదు. ఈ వేదన వివేకాను కృంగదీసింది. ఎమ్మెల్సీగా వెళ్లిపోవాలన్న కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు...ఇదే ఇప్పుడు రాజ‌కీయంగానే కాదు జిల్లా నాయ‌కులు అంద‌రూ చ‌ర్చించుకునే అంశం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.